• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"చైనా యాప్స్ తీసేద్దాం", బాయ్ కాట్ చైనా- డ్రాగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న దేశం...

|

కాశ్మీర్ లోని లడఖ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా చైనా బలగాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్న నేపథ్యంలో భారతీయుల్లో ఉక్రోషం పెరుగుతోంది. చౌక వస్తువుల పేరుతో తమ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకుంటూ వాటి ద్వారా వచ్చే సొమ్మును తిరిగి భారత్ తో కయ్యం కోసం ఖర్చుపెట్టాలనుకుంటున్న డ్రాగన్ దేశం దుర్మాగాన్ని తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, విద్యావంతులు ఇప్పుడు కొత్త నినాదాలతో ముందుకొస్తున్నారు.

అటు చైనా,ఇటు పాక్: దాడికి సిద్ధం.. పీవోకేలో కిక్కిరిసిన ఉగ్రశిబిరాలు.. ఆర్మీ కీలక ప్రకటన..

బాయ్ కాట్ చైనా....

బాయ్ కాట్ చైనా....

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా సతమతం అవుతున్న వేళ పొరుగు దేశం చైనా మాత్రం భారత భూభాగం దురాక్రమణకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. కశ్మీర్ లోని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌ సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ భారత బలగాలపై ముష్టిఘాతాలు కురిపిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో దేశవ్యాప్తంగా చైనా వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో డోక్లాం ఘటన సమయంలోనూ డ్రాగన్ పై వ్యతిరేకత వ్యక్తమైనా ఈసారి దానికి పదింతలు ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో చైనాకు అడ్డుకట్టే వేసేందుకు ముందుగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే వాదన వినిపిస్తోంది.

రిమూవ్ చైనా యాప్స్....

రిమూవ్ చైనా యాప్స్....

ముఖ్యంగా భారత్ లో అత్యధిక మార్కెట్ కలిగిన చైనా యాప్ టిక్ టాక్ తో పాటు మరికొన్ని యాప్ లను భారతీయులు తమ ఫోన్ ల నుంచి తొలగించాలని కోరుతూ "రిమూవ్ చైనా యాప్స్" నినాదం ఊపందుకుంటోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ త్రీ ఇడియట్స్ చిత్ర నిర్మాత విధూ వినోద్ చోప్రా తీసిన ఈ సినిమాకు ప్రేరణగా నిలిచిన సోనమ్ వాంగ్ చుక్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో బాయ్ కాట్ చైనా నినాదానికి స్ఫూర్తి నిస్తోంది. ఈ వీడియాలో వాంగ్ చుక్... చైనా కుటిల నీతిని దుయ్యబడుతూనే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిష్కార మార్గాలు కూడా సూచించారు. ఈ వీడియో రిలీజయ్యాక భారత్ లో బాయ్ కాట్ చైనా నినాదం యువతను, పెద్దవాళ్లను అందరినీ ఉర్రూతలూగిస్తోంది.

 వాంగ్ చుక్ సందేశం ప్రేరణ....

వాంగ్ చుక్ సందేశం ప్రేరణ....

ప్రస్తుతం లడఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోవాలంటే చైనాకు సంబంధించిన ప్రతీ వస్తువునూ భారతీయులు బహిష్కరించాల్సిందేనని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. భారతీయులు చైనాను "వాలెట్ పవర్" తో ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తన వీడియోలో దిశానిర్దేశం చేశారు. మన సైనికులు సరిహద్దుల్లో చైనాతో పోరాడుతుంటే మనం చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని, దీంతో చైనాకు వెళ్లే డబ్బును తిరిగి మన దేశంపై యుద్దానికి డ్రాగన్ దేశం వాడుతోందని వాంగ్ చుక్ తన వీడియోలో చక్కగా వివరించారు.

వాంగ్ చుక్ వీడియో స్ఫూర్తితో...

వాంగ్ చుక్ వీడియో స్ఫూర్తితో...

చైనా ఉత్పత్తులను ఎందుకు బహిష్కరించాలో వాంగ్ చుక్‌ వివరించిన శైలి ఎంతో గొప్పగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు జనం ఎక్కడ చూసినా #BoycottChina, #BoycottMadeinChina, #BoycottChineseApps #BoycottTiktok నినాదాలనే వినిపిస్తున్నారు. సోషల్ మీడియా కూడా ఈ నినాదాలతో హోరెత్తిపోతోంది. ఈ నినాదాలతో పెట్టిన పోస్టులు సైతం కోట్ల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. డ్రాగన్ వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ కూడా తన ఫోన్ నుంచి టిక్ టాక్ యాప్ తీసేస్తున్నట్లు ప్రకటించారు.

ఎలా తొలగించాలని గూగుల్ సెర్చ్...

ఎలా తొలగించాలని గూగుల్ సెర్చ్...

చైనా యాప్ లకు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటవుతున్న తరుణంలో ఇప్పుడు ఎక్కడ చూసినా యువత వాటిని ఎలా తొలగించాలనే అంశాన్ని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ట్రెండ్స్ లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. తమ ఫోన్ల నుంచి చైనా యాప్ లు ఎలా తొలగించాలన్న పదం గూగుల్ సెర్చ్ లో భారీగా ట్రెండ్ అవడం ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతోంది.

English summary
after border tenisons with china, indians have found a way to boycott chinese products with viral "remove china apps" slogan. people tried to create awareness about chinese plans on india by using local money through these apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more