• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ అగ్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారతీయ టెక్కీలు..కారణమేంటో..?

|

అమెరికాలో ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు చాలామంది ఉన్నారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముందుగా అమెరికా గడ్డపై కాలుపెడితే ఏ హోటల్‌లోనో పెట్రోల్ బంకుల్లోనో పనిచేసుకుంటూ ఆ తర్వాత చిన్న టెక్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించొచ్చు అనుకునే వారు కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వెంటనే అమెరికా టార్గెట్‌గా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. అంటే ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం చేయడమంటే అదో క్రేజ్. కానీ తాజాగా ఓ రిపోర్టు పలు సంచలన విషయాలను బయటపెట్టింది.

 అమెరికాలో డ్రీమ్ జాబ్

అమెరికాలో డ్రీమ్ జాబ్

అమెరికాలో ఉద్యోగం సంపాదించాలంటే ఒకప్పుడు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అక్కడ ఉద్యోగం చేయాలన్న ఒకే ఒక కోరికతో అప్పటి యువత అడుగులు ముందుకేసింది. ఇక అమెరికాలో ఉద్యోగం చేయాలన్న విదేశీయుల సంఖ్య బాగానే పెరిగినప్పటికీ... భారతీయుల్లో మాత్రం అమెరికా ఉద్యోగాలు వద్దు అనే అభిప్రాయం నెలకొన్నట్లు ఓ ప్రముఖ సర్వే తెలిపింది. ఇక అమెరికాలో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీయుల్లో 2019 ఏప్రిల్‌నాటికి 9.6శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఈ లెక్క 9.3శాతంగా ఉన్నింది.

అమెరికా ఉద్యోగమా...మకొద్దు బాబోయ్..!

అమెరికా ఉద్యోగమా...మకొద్దు బాబోయ్..!

అమెరికాలో ఉద్యోగాలు పొందాలనుకునే వారి ఆశలపై కఠిన ఆంక్షలను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ విధించినప్పటికీ ఇవేమీ అడ్డుగా భావించడం లేదు యువత. వారి టార్గెట్‌ అంతా అమెరికాలో ఉద్యోగం సంపాదించడమే. కొన్ని దేశాలకు చెందిన వారు మాత్రం అమెరికాలో పనిచేయాలంటేనే బాబోయ్ అంటున్నారు. పెద్దగా ఆసక్తి కూడా కనబరచడం లేదు. ఇక అమెరికాలో ఉద్యోగాలు వెతికేందుకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్న వారిలో అత్యల్పంగా భారతీయులే ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని ప్రముఖ ఎకానమిస్టు ఆండ్రూ ఫ్లవర్స్ తెలిపారు. ఇండియా తర్వాతి స్థానంలో పాకిస్తాన్ యూకే దేశాలున్నాయి.

 అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారత టెక్కీలు

అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారత టెక్కీలు

అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయుల సంఖ్య బాగానే ఉంది. కానీ అమెరికాలో జాబ్ చేయాలనే వారి సంఖ్య మాత్రం 3.7శాతంగానే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అంటే అమెరికాలో ఉద్యోగాల కోసం ఇంటర్నెట్‌లో వెతికే వారి సంఖ్య తగ్గిపోయిందని నివేదిక పేర్కొంది. అంటే విదేశాల్లో ఎక్కడైన పనిచేసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ అమెరికా అంటే ఇంట్రెస్ట్ చూపడం లేదని ఆ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఇక కెనడా ఐపీ అడ్రసు నుంచి అమెరికాలో ఉద్యోగాలపై ఆసక్తి చూపని వారు భారత్ తర్వాత ఎక్కువమంది ఉన్నారు. ఆ తర్వాత యూకే, జర్మనీ, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారు కూడా అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు జర్మనీ, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్‌కు చెందిన వారు అమెరికా ఆఫర్ చేసే అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇందుకు కారణం వారి ఆర్థిక వ్యవస్థ మందగించడమే అని వెల్లడించింది.దీంతో దేశీయంగా అక్కడి వారికి ఉద్యోగాల కొరత నడుస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.

English summary
Foreign tech workers face higher hurdles to a get a job in the US but that hasn’t stopped their interest in working there.India is still the largest source of foreign job clicks on US tech listings by a large margin, according to the study. Job seekers in India accounted for 3.7% of all clicks for US tech postings in April. Clicks from Canadian IP addresses were second while the U.K., Germany and Philippines rounded out the top five.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X