వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లోని భారతీయులు టికెట్ కొనాల్సిందే: 64 విమానాలు, ఏయే రాష్ట్రాల నుంచి ఎన్నంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు ప్రారంభించింది. వారిని దశలా వారీగా స్వదేశానికి తీసుకొస్తామని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Recommended Video

Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

ఏడు రోజుల్లో 14,800 మంది..

ఏడు రోజుల్లో 14,800 మంది..


భారతీయులను తీసుకొచ్చేందుకు 64 విమానాలను నడపాలని యోచిస్తోంది. మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలు..

ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలు..

భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిరిండియా, దాని అనుబంధ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక విమానాలను నడపనున్నాయన్నారు. యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల నుంచి భారతీయులను వెనక్కి రప్పించనున్నారు.

ఎవరి ఖర్చులు వారే భరించాలి

ఎవరి ఖర్చులు వారే భరించాలి

కాగా, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను విమానాలు, నౌకాదళ ఓడల్లో తరలించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానం(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్-ఎస్ఓపీ) సిద్ధం చేసినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ప్రకటించింది. భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటు చేయాలని, ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని తెలిపింది. అయితే, స్వదేశానికి వచ్చే విదేశాల్లోని భారతీయులు ఎవరి ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పురి మంగళవారం స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రాల నుంచి విమానాలు..

ఏ రాష్ట్రాల నుంచి విమానాలు..

మే 7 నుంచి మే 13 మధ్య 64 విమానాలు నడపనున్న కేంద్రం.. యూఏఈకి 10 విమానాలు, అమెరికా, యూకేలకు చెరో ఏడు చొప్పున విమానాలను నడపనుంది. అలాగే, సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్‌కు ఐదు, ఖతార్ కు రెండు చొప్పున విమానాలు నడపనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మలేషియా, బంగ్లాదేశ్‌లకు చెరో ఏడు, కువైట్, ఫిలిప్పీన్స్ కు చెరో ఐదు, ఒమన్, బహ్రెయిన్‌కు చెరో రెండు చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది. మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, ఢిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో ఏడు, మిగితా రాష్ట్రాల నుంచి ఐదు చొప్పున విమానాలు నడుస్తాయని తెలిపారు. ఏడు రోజుల్లో 14,800 మంది భారతీయులు చేరుకుంటారని, మిగితా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాలు నడుపుతుందని వెల్లడించారు.

English summary
All asymptomatic Indians will be asked to self quarantine for 14 days after they land in India. The state governments will be responsible for the quarantine facilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X