వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ కంటే స్మార్ట్‌ఫోన్‌కే భారతీయుల ప్రాధాన్యం: సర్వే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

'స్లీపింగ్ పార్ట్‌నర్'‌గా ఒకప్పుడు భర్త లేదా భార్య ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఆ స్ధానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయట. అంతే కాదు తమ కొత్త 'స్లీపింగ్ పార్ట్‌నర్' కోసం వారాంతాల్లో శృంగారాన్ని కూడా భారతీయులు పక్కన పెట్టేస్తున్నారట.

ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఏడు దేశాల్లో 7,000 మందికి పైగా స్మార్ట్‌ఫోన్ వాడకంపై మోటరోలా కంపెనీ నిర్వహించిన సర్వేలో మన దేశంలో ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, స్పెయిన్, మెక్సికో, చైనా, ఇండియా దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది.

Indians want smartphones more than sex: Survey

ఈ సర్వే ప్రకారం 74 శాతం మంది భారతీయులు, 70 శాతం మంది చైనీయులు తమ స్మార్ట్ ఫోన్లను పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు స్నానం చేసేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్‌ని వదలడం లేదంట. తాము ఎంతో ఇష్టంగా పెంచుకునే పిల్లి మంటల్లో చిక్కుకుంటే దాన్ని కాపాడటం కంటే ముందు స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే మెసేజ్‌లనే చూస్తామని 54 శాతం మంది చెప్పారు.

జీవితంలో తమ బెస్ట్ ఫ్రెండ్‌కు కూడా చెప్పని రహస్యాలను స్మార్ట్ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుంటున్నారని 40 శాతం మంది పేర్కొన్నారు. 39 శాతం మంది తమ స్మార్ట్ ఫోన్ తో సంతోషంగా ఉన్నామని చెబితే, మిగతా వాళ్లు తమ స్మార్ట్ ఫోన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యమైన పనుల్లో ఉండగా, ఫోన్ తమ దృష్టిని మరలుస్తుందని పేర్కొన్నారు. గతేడాది కూడా ఇలాంటి సర్వేనే ఒకటి చేశారు. అప్పట్లో 57 శాతం మంది భారతీయులు స్మార్ట్ ఫోన్లు లేకుండా బతకలేమని చెప్పారు.

English summary
More and more Indians are now hooked to smartphones and some are even sleeping with the devices in their hands, a survey has revealed, adding that some would rather give up sex for a weekend than part with their new "sleeping partner."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X