వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabh Election 2019 : దేశం మిమ్మల్ని క్షమించదు... శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం..!!

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్‌లోని బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులపై సందేహం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్స్‌పై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పుల్వామా దాడికి వ్యతిరేకంగా పాక్ పై దాడి చేయడం కరెక్ట్ కాదు : శ్యామ్ పింట్రోడాపుల్వామా దాడికి వ్యతిరేకంగా పాక్ పై దాడి చేయడం కరెక్ట్ కాదు : శ్యామ్ పింట్రోడా

ఉగ్రవాదులను వెనకేసుకుకొస్తున్న కాంగ్రెస్
ఉగ్రవాడికి దీటుగా భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ పై సందేహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ తీరు ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్నట్లు ఉందని మోడీ విమర్శించారు. పాక్ ఉగ్రదాడికి దీటుగా భారత సైన్యం బదులివ్వడం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్న విషయం యావత్ దేశానికి తెలుసని, శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో ఆ విషయం మరోసారి రుజువైందని అన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం ఇచ్చామని మోడీ స్పష్టం చేశారు.

Indians Wont Forgive : PM After Congress Sam Pitroda Questions Balakot

జవాన్ల త్యాగాలు కించపరుస్తున్న కాంగ్రెస్
ఉగ్రవాదుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం, త్రివిధ దళాల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను కించపరుస్తున్న ప్రతిపక్షానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ను దేశం ఎన్నటికీ క్షమించబోదన్న విషయం వారికి అర్థమయ్యేలా చేయాలని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi today tore into Congress leader Sam Pitroda, a close aide of Rahul Gandhi, over his comments questioning the impact of the Balakot air strike. The opposition "is the natural habitat of terror apologists" and "insults our forces time and again", the Prime Minister tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X