వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కొనసాగుతున్న పైలట్ల కొరత... మరో 130 విమానాలు రద్దు

|
Google Oneindia TeluguNews

బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో లో కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విమానాలు నడిపేందుకు సరిపడా పైలట్లు లేకపోవడంతో మరో దేశవ్యాప్తంగా మరో 130 విమానాలను రద్దు చేసింది. ఇది ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఆపరేట్ చేస్తున్న మొత్త విమానాల్లో 10శాతం కావడం విశేషం. మరోవైపు దీనిపై విచారణకు ఆదేశించగా సమాధానం ఇచ్చేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. గత శనివారం నుంచి విమానాలను రద్దు చేస్తూ వస్తోంది ఇండిగో విమానాయాన సంస్థ. చివరి నిమిషంలో రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు ప్రయాణికులు.

ఇక గురువారం రోజున దాదాపు 70 విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్. అప్పటికే కొన్ని విమానాలను రద్దు చేయగా... ఎయిర్ షో కారణంగా బెంగళూరు విమానం మూసివేశారన్న సాకు చూపింది యాజమాన్యం. ఇక మార్చి 31 నాటికి తిరిగి అన్ని సర్వీసులను పునఃప్రారంభిస్తామని ఆ యాజమాన్యం వెల్లడించింది. ఇక పైలట్లకు నోటీసులు పంపడం గురువారం నుంచి ప్రారంభమైంది. రద్దు అయిన విమానాల స్థానంలో మరి కొంతమంది ప్రయాణికులను ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు యాజమాన్యం తెలిపింది. బుధవారం రోజున 49 విమానాలను రద్దు చేసింది యాజమాన్యం.

IndiGo Cancels 130 Flights Scheduled for Today as Pilot Shortage Cripples Operations

ఇక ఫిబ్రవరి 13న పలు కారణాలు చూపుతూ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.తొలి రోజు 30 విమానాలు రద్దు చేస్తున్నట్లు చెప్పిన ఇండిగో సంస్థ... ఆ తర్వాత విమానాల రద్దు కొన్ని రోజుల వరకు కొనసాగుతుందని ఆ రోజే వెల్లడించింది. ఇదిలా ఉంటే రద్దయిన విమానాల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇస్తోంది సంస్థ. అంతేకాదు వీలైతే మరో ప్రత్యామ్నాయం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది.

English summary
Acute shortage of pilots along with NOTAMs at some airports forced IndiGo to cancel around 130 flights for Friday, a source said.The cancelled flights account for almost 10 per cent of the airline's operations, the source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X