వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమానంలో ఐస్ నినాదాలు: బెంబేలెత్తిపోయారు
కొచ్చి: గాలిలో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన ఉగ్ర నినాదాలు ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేశాయి. మిగితా ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. దీంతో విమానాన్ని దారి మళ్లించారు.
వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి కొచ్చి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి ఐఎస్ఐఎస్ అంటూ గట్టిగా నినాదాలు చేసి విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశాడు.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించాల్సి వచ్చింది. అనంతరం ముంబయి ఎయిర్పోర్ట్ పోలీసులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత విమానంతిరిగి కొచ్చి బయలుదేరింది.
Comments
indigo flight mumbai passengers isis slogans kochi ఇండిగో విమానం ముంబై ప్రయాణికులు ఐఎస్ఐఎస్ నినాదాలు కొచ్చి
English summary
An Indigo Airlines flight from Dubai to Kochi was diverted to Mumbai after a passenger started shouting pro-ISIS slogans onboard.
Story first published: Thursday, July 28, 2016, 12:57 [IST]