వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ప్రతీ విమానంలో రెండు దోమల బ్యాట్లు: ఇండిగో నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విమానాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టింది ఇండిగో ఎయిర్‌లైన్. ఇందులో భాగంగా విమానాల్లో దోమల బ్యాట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విమానాల్లో ఎలక్ట్రికల్ బ్యాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

విమానంలో దోమల బెడదపై ఇటీవల ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన ఎఫెక్ట్ తో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది ఇండిగో ఎయిర్ లైన్స్. దోమలున్నాయని ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రయాణికుడిని దించేయడంతో ఇండిగో వివాదంలోనూ ఇరుక్కుంది.

IndiGo to have mosquito swatters on its planes

కాగా, దోమల నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో విమానంలో 2 ఎలక్ట్రికల్ బ్యాట్లను ఉంచనున్నట్టు సమాచారం. నిర్ణీత సమయం ప్రకారం కేబిన్ సిబ్బంది వీటిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. అయితే విమానంలో ఇంధనాన్ని నింపేటప్పుడు మాత్రం వీటిని ఉపయోగించబోరని ఓ అధికారి తెలిపారు.

దోమల బెడదపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, ఆ కారణంగా విమానాలు ఆలస్యమైన ఘటనలు కూడా ఉండటంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇండిగో అధికారి ప్రతినిధి దీనిపై స్పందించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎలక్ట్రిక్ బ్యాట్లను ఉపయోగిస్తామని అన్నారు. కాగా, కోల్‌కతా, లక్నో, వారణాసి లాంటి ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

English summary
Its staff can pin down a passenger on the tarmac or offload an “aggressive” human, but what if they are threatened by swarms of mosquitoes?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X