వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టేకాఫ్.. ల్యాండింగ్... రాత్రంతా విమానంలోనే.. కనీసం తిండి కూడా పెట్టలేదు.. ప్రయాణికుల గగ్గోలు

|
Google Oneindia TeluguNews

ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో విమానాలు, రైలు సర్వీసులను కూడా తగ్గాయి. అయితే వర్షాలతో ఇండిగో విమానంలో జరిగిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి చూసింది. వర్షాలతో ప్రయాణికులంతా విమానంలో తమ సీట్లకే అతుక్కుపోయారు. అక్కడినుంచి లేవొద్దని సిబ్బంది తమను బెదిరించారని ప్యాసెంజర్స్ వాపోయారు. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. ముంబైలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?కాంగ్రెస్‌లో బీజేపీ గూఢచారి: ప్రవీణ్‌ చక్రవర్తిని డిమోట్ చేసిన సోనియా, ఎందుకంటే.?

వర్షాలతో దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే 20 సర్వీసులను ఇండిగో ఆపివేసినట్టు పేర్కొంది. వర్షాలతో కొందరు తమ టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే బుధవారం రాత్రి 7.55 గంటలకు ముంబై నుంచి ఇండిగో విమానం బయల్దేరింది. కానీ వాతావరణం బాగోలేకపోవడంతో వెంటనే నిలిపివేశారు. వర్షాల వల్ల రాత్రంతా తమను విమానంలోనే ఉంచారని ప్రయాణికులు వాపోయారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ముంబై నుంచి విమానం బయల్దేరిందని .. ఉదయం 8 గంటలకు జైపూర్ చేరుకున్నామని ప్రయాణికులు తెలిపారు.

IndiGo passengers ‘forced’ to sit in stranded flight; DGCA to probe

రాత్రి పూట కూడా తమను సిబ్బంది కనీసం సీట్ల నుంచి కూడా లేవనీయలేదని పేర్కొన్నారు. కనీసం నైట్ డిన్నర్ కూడా పెట్టలేదని పేర్కొన్నారు. ఒకవేళ తాము లేస్తామని అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను పిలుస్తామని భయపెట్టారని గుర్తుచేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో విమానం సీట్లకు తాము రాత్రంతా అతుక్కుపోయామని ప్రయాణికులు వాపోయారు. దీనిపై విచారణ జరుపుతామని డీజీసీఏ పేర్కొన్నది. ప్రయాణికులతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
Aviation regulator DGCA will probe the alleged incident of budget carrier IndiGo forcing the passengers of its Jaipur-bound flight to sit in the stranded aircraft at Mumbai Airport on Wednesday night, a top official source said. IndiGo’s operations at the city airport were hit hard with the carrier cancelling many flights on Wednesday following incessant rains in the city. Of around 20 flights that were cancelled, most were of IndiGo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X