వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా జై సింగ్ సంచలనం: నిర్భయ తల్లి ఎందుకు సోనియాగాంధీలా ఆలోచించడం లేదు..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్భయ దోషులకు ఎప్పుడెప్పుడు ఉరిశిక్ష విధించాలని యావత్ జాతి కోరుకుంటే.. ఇందిరా జై సింగ్ మాత్రం.. అందుకు విరుద్ధంగా మాట్లాడారు. నిర్భయ తల్లి ఆశాదేవి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలా ఎందుకు మారకూడదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇందిరా జై సింగ్ వ్యాఖ్యలు పెనుదుమారం రేపే అవకాశం ఉంది.

క్షమాభిక్ష తిరస్కరణ..

క్షమాభిక్ష తిరస్కరణ..


2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Recommended Video

'Getting frustrated'- Nirbhaya's mother on hanging of convicts rescheduled to Feb 01
ఫిబ్రవరి 1న..

ఫిబ్రవరి 1న..

తొలుత ఈ నెల 22వ తేదీన ఉరి శిక్ష విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముఖేశ్ కుమార్ క్షమాభిక్ష కోరడం, దానిని రాష్ట్రపతి తిరస్కరించడంతో గడువు పెరిగింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ తర్వాత రెండువారాల తర్వాత దోషులకు శిక్ష అమలు చేస్తారు. అలా ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలుచేస్తారు.

ఆశాదేవి అసహనం..

ఆశాదేవి అసహనం..

దోషులకు ఉరిశిక్ష జాప్యంపై నిర్భయ తల్లి ఆశావేది అసహనం వ్యక్తం చేశారు. ‘దోషుల ఉరి శిక్ష మరింత ఆలస్యం కావడంతో.. ప్రధాని నరేంద్ర మోడీ కల్పించుకోవాలని కూడా కోరారు. నిర్భయపై లైంగికదాడి జరిగిన సమయంలో కొందరు రాజకీయ నేతలు నినాదాలు చేశారు. మరికొందరు మహిళల భద్రత గురించి మాట్లాడారు. తమ రాజకీయ ప్రయోజనాల కోనం అప్పుడు గొంతెత్తి నినాదించారు. కానీ దోషుల ఉరిశిక్షపై మాత్రం మాట్లాడటం లేదు' అని ఆశాదేవి మండిపడ్డారు. దోషులను ఉరి తీసే వరకు తనకు మనస్సాంతి లేదని పేర్కొన్నారు.

ఇదీ ఇందిర వాదన..

ఇదీ ఇందిర వాదన..


ఆశాదేవి వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్ స్పందించారు. దోషులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. ఆశాదేవి ఎందుకు వారిని క్షమించడం లేదన్నారు. ‘నిర్భయ తల్లి ఆశాదేవి పడే మనోవేదన తెలుసు, కానీ ఆమె ఎందుకు సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ హతమార్చిన నళినికి సోనియా క్షమాభిక్ష ప్రసాదించారు కదా అని గుర్తుచేశారు. నళినికి ఉరిశిక్ష విధించాలని అనుకోవడం లేదు అని సోనియా చాలా సందర్భాల్లో చెప్పారు. నిర్భయ ఘటనపై మేమంతా మీతో ఉన్నాం, కానీ ఉరిశిక్షకు మాత్రం తాను వ్యతిరేకమన్నారు. సోనియా గాంధీ లాగా ఎందుకు ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవడం లేదు అని' ఇందిరా జై సింగ్ ట్వీట్ చేశారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Advocate Indira Jaising urges Nirbhaya's mother to follow Sonia Gandhi's example, forgive convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X