వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ చైనాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయా..? రాజకీయ జోక్యం ఉండాల్సిందేనా..?

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా వాస్తవాధీన రేఖ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చర్చలు జరపాలని భావించాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే చర్చల ద్వారా సానుకూలమైన ఫలితం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చర్చలు ద్వారానే సమస్యకు పరిష్కారం దొరకదనేది స్పష్టమవుతోంది. మరిన్ని చర్చలు భవిష్యత్తులో జరుగుతాయని తెలుస్తోంది. అప్పటి వరకు సరిహద్దుల వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొనకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు సమాచారం.

ఇక చర్చలు జరిగి సమస్యకు పరిష్కారం వచ్చినప్పటకీ .. రెండు దేశాల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంపైనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ద్వారా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం తగ్గుముఖం పడుతుందని కొందరు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు దేశాల తరపున చర్చలు జరుపుతున్న వారు చివరకు దేశ ప్రభుత్వాలనే సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Indo China talks to be on a positive note, but reverting to political hierarchy inevitable

రెండు దేశాల మధ్య బేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను శాంతియుతమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. పరస్పర అభిప్రాయాలను గౌరవిస్తూనే సమస్యకు పరిష్కారం కనుగొనాలనే పట్టుదలతో ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి ఆందోళనకరమైన వాతావరణం నెలకొనకుండా రెండు దేశాల మిలటరీ అధినేతలు ఒక కార్యాచరణ రూపొందిస్తారని సమాచారం.

చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్దచైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్ద

Recommended Video

#IndiaChinaBorder : భారత్ - చైనా సరిహద్దు వివాదానికి.. తెర దించే దిశగా తొలి అడుగు!

ఏప్రిల్ 2018, అక్టోబర్ 2019న జరిగిన మోడీ-జిన్‌పింగ్‌ల సమావేశంలో ఇరు నేతలు సరిహద్దు వివాదంపై ఒక ఏకాభిప్రాయంకు వచ్చిన విషయాన్ని రెండు దేశాలకు చెందిన దౌత్యాధికారులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం సందర్భంగా గుర్తుచేశారు. రెండు సార్లు మోడీ-జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన అనధికారిక చర్చల్లో విబేధాలు వివాదాలకు దారితీయకూడదని దీనికి పరిష్కారం కోసం ప్రయత్నిద్దామని నాడు చర్చించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌ తరపున నాయకత్వం వహిస్తున్న లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్ సరిహద్దు వద్ద స్టేటస్‌కో అమలుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ నిర్మించిన బంకర్లను కూల్చివేయాలని కోరే అవకాశాలున్నట్లు సమాచారం.

English summary
India is optimistic about the talks with China today amidst the standoff along the Line of Actual Control. However there is also realisation that this may not be the final round of talks to defuse tensions along the border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X