వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం నేలకూలిన ఘటనలు యుద్ధం ఆరంభమైనదనడానికి సంకేతాలుగా భావిస్తున్నారు. జమ్మూ, కాశ్మీర్, లేహ్ నగరాలకు రాకపోకలు సాగించే పౌర విమానాలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇవన్నీ యుద్ధానికి సంకేతాలుగా భావిస్తున్నారు. భారత ఛాపర్ ను కూల్చడం ద్వారా పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ఆరంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా- బుధవారం ఉదయం నుంచి సరిహద్దు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలుతున్నారు. మూట, ముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాలను అందిపుచ్చుకుని, సురక్షిత ప్రదేశాలకు బయలుదేరి వెళ్తున్నారు.

Indo-pak border villages vacated by army and safe guard to villagers

నియంత్రణ రేఖ సమీపంలో గ్రామాలు

బడ్గామ్, నౌషెరా, యూరీ, రాజౌరీ, కథువా, బారాముల్లా, పూంఛ్, కుప్వారా, సాంబా సెక్టార్ల పరిధిలోని గ్రామాలు పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటాయి. సరిహద్దులకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపితే.. ఆయా సెక్టార్ల పరిధిలోని గ్రామాలు విధ్వంసానికి గురవుతాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి మోర్టార్లే ప్రధాన ఆయుధం. సాధారణ పౌరులు నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు సరిహద్దులకు అవతలి వైపు నుంచి మోర్టార్ల ద్వారా దాడులు చేస్తుంటారు. అవి తగిలి సాధారణ పౌరులు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని మనదేశం సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. దీనితో ఆయా సెక్టార్ల పరిధిలోని గ్రామాల్లో నివసిస్తున్న వారు మూటా, ముల్లె సర్దుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. వారి కోసం ప్రభుత్వం ఇదివరకే షెల్టర్లను నిర్మించింది. ప్రస్తుతం వారిని ఆయా షెల్టర్లకు తరలిస్తున్నారు. దీనికోసం సైన్యం గ్రామీణుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. మరికొందరు తమ వ్యక్తిగత వాహనాలతో బయలుదేరి వెళ్తున్నారు.

English summary
Villagers near India-Pakistan border are vacat their homes in the row of war tensions across the border. Wednesday morning, Villages under Noushera, Budgam, Uri, Kathua, Baramulla, Poonch, Kupwara sectors limits are went safe places. Indian army soldiers guarding them, who relocate the villagers. The Tension going high along LoC, and the border after Indian Air Force crack down the Pak jet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X