వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు భారత్-అమెరికా భారీ షాక్ .. అండమాన్ దీవుల్లో ఇరుదేశాల యుద్ధనౌకలు..

|
Google Oneindia TeluguNews

చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తర్వాత భారత్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గతంలో కంటే దూకుడు కూడా పెరిగింది. గల్వాన్ ఘటనలో సైనికులను కోల్పోయిన తర్వాత మోడీ సర్కారులో ప్రతీకార ధోరణి స్ఫష్టమవుతోంది. దీంతో త్వరలో అమెరికాతో కలిసి భారత యుద్ధనౌకలతో అండమాన్ దీవుల్లో విన్యాసాలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది. అసలే అధ్యక్ష ఎన్నికల్లో భారత్ మద్దతు కోసం ఎదురుచూస్తున్న అధ్యక్షుడు ట్రంప్.. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో అమెరికాకుచెందిన యుద్ధనౌకలు యూఎస్ఎస్ నిమిట్జ్, యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ భారత్ జలాల్లోకి వస్తున్నాయి.

Recommended Video

India-China Face Off:సరిహద్దుల్లో భారత బ్రహ్మాస్త్రం..ఈ నెల 22వ తేదీన వైమానిక దళ అధికారుల కీలక భేటీ!

భారత్ కు మిత్రదేశం ఇరాన్ ఊరట.. చైనా, అమెరికాకు షాకిస్తూ - అవన్నీ పుకార్లేనంటూ..భారత్ కు మిత్రదేశం ఇరాన్ ఊరట.. చైనా, అమెరికాకు షాకిస్తూ - అవన్నీ పుకార్లేనంటూ..

 భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు..

భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు..

గల్వాన్ ఘటన తర్వాత అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి భారత్ కు మద్దతిచ్చేలా అమెరికాను ఒప్పించడంలోనూ భారత్ కొంత మేర సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత అమెరికా మద్దతు పొందడంలో విజయవంతమైన భారత్... ఇప్పుడు మరో కీలక చర్యకు సిద్ధమవుతోంది. అమెరికాతో కలిసి అండమాన్ దీవుల్లో యుద్ధ నౌకా విన్యాసాల నిర్వహణకు భారత్ సిద్దమవుతోంది. అమెరికాకు చెందిన యుద్ధనౌక యూఎస్ఎస్ నిమిట్డ్ తో కలిసి అండమాన్ తీరంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఇతర భారత యుద్ధ నౌకలు త్వరలో గర్జించబోతున్నాయి.

చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్...

చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్...

వాణిజ్య ప్రయోజనాల కోణంలో అమెరికాను మచ్చిక చేసుకుని తద్వారా భారత్ ను ఇరుకునపెట్టాలని భావిస్తున్న చైనాకు గట్టి షాక్ ఇచ్చేలా ఈ సంయుక్త విన్యాసాలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. తద్వారా అమెరికా-భారత్ కలిసే ఉన్నాయనే సంకేతాలను చైనాకు పంపాలని ఇరుదేశాలూ భావిస్తున్నాయి. దీంతో ఈ యుద్ధ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా యుద్ధ విమానాలను మోసుకెళ్లే యుద్ధనౌక యూఎస్ఎస్ నిమిట్జ్ తో కలిసి భారత యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గోబోతున్నాయి. దీంతో ఇరుదేశాల సైనిక సామర్ధ్యాన్ని చైనాకు గుర్తుచేసినట్లవుతుందని భావిస్తున్నారు.

ట్రంప్ కూ ప్రయోజనం...

ట్రంప్ కూ ప్రయోజనం...


ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు నవంబర్ లో జరిగే ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకు భారతీయుల మద్దతు ఎంతో అవసరం. అమెరికాలో ఎన్నికలను ప్రభావితం చేసే స్ధాయిలో ఉన్న భారతీయులను మచ్చిక చేసుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశంకూడా వదులుకోరాదని భావిస్తున్నట్రంప్... మన దేశంతో కలిసి సంయుక్త యుద్ధ నౌకల విన్యాసాలకు సై అనేశారు. తద్వారా అమెరికా ఎప్పుడూ భారత్ తోనే ఉందనే సంకేతాలను స్వదేశంలోని భారతీయులకు పంపాలనేది ఆయన ఉద్దేశం. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడెలా వ్యవహరిస్తుందో తెలియని అమెరికా.. తమతో యుద్ధ విన్యాసాలకు సిద్ధం కావడాన్ని భారత్ కూడా స్వాగతిస్తోంది. అమెరికా నుంచి ఈ మేరకు ప్రతిపాదన రాగానే మోడీ కూడా సై అనేశారు.

పాసెక్స్ పేరుతో ఇరు దేశాల నేవీ విన్యాసాలు

పాసెక్స్ పేరుతో ఇరు దేశాల నేవీ విన్యాసాలు


ఇరుదేశాల యుద్ధ నౌకలు అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించబోతున్న ఈ విన్యాసాలకు పాసెక్స్ అనే పేరు పెట్టారు. ఈ విన్యాసాల కోసం అమెరికా అణుయుద్ద నౌక యూఎస్ఎస్ నిమిట్జ్ ఎయిర్ క్రాఫ్ట్ లను మోసుకుంటూ హిందూ మహా సముద్రంలోకి అడుగుపెట్టింది. దీంతో పాటు మరో యుద్ధనౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ కూడా బయలుదేరినట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమదే అధిపత్యమని వాదిస్తున్న చైనాకు ఇరుదేశాల నేవీలు కలిసి ఈ విన్యాసాలతో భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాని మిత్రదేశాల ఆధిపత్యం ఎలా ఉంటుందో చైనాకు రుచి చూపించేలా ఈ విన్యాసాలు ఉండబోతున్నట్లు సమాచారం.

English summary
in a strong signal to china amid military confrontation in eastern ladakh, us aircraft carrier uss nimitz is set to conduct an excercise with indian warship near the andaman and nikobar archipelago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X