వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేనా మాజాకా : బ్యాటుతో మున్సిపల్ అధికారిపై దాడి .. అరెస్ట్ .. కారణమిదే .? (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

బ్యాటుతో మున్సిపల్ అధికారిపై దాడి BJP ఎమ్మెల్యే || Oneindia Telugu

భోపాల్ : అతను చేసిన తప్పేంటి అంటే విధులు సరిగా నిర్వర్తించడమే. తన పరిధిలో సక్రమంగా పనిచేస్తే ఆ ఎమ్మెల్యేకు నచ్చలేదు. ఆ అధికారిని దూషించాడు. అయినా ఆగ్రహం చల్లారలేదు. దీంతో బ్యాట్ పట్టుకొని తన ప్రతాపాన్ని చూపించాడు. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రజాప్రతినిధి మున్సిపాల్ కార్యాలయం ఎదుట హల్‌చల్ చేశాడు.

బ్యాట్‌తో దాడి ..

బ్యాట్‌తో దాడి ..

మధ్యప్రదేశ్‌లోగల ఇండోర్ మున్సిపాల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గీయ కుమారుడే .. ఆకాశ్. ఇండోర్ మున్సిపాలిటీ వద్ద అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు. కోపం ఆపుకోలేక అక్కడే ఉన్న బ్యాటుతో దాడి చేశాడు. అతను దాడిచేస్తున్న సమయంలో ప్రజలు అక్కడే ఉన్నారు. అయినా ఏం బెదరకుండా తన పనిని పూర్తిచేశాడు. ఏం జరిగిందని అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆకాశ్‌ను అడగ్గా .. అధికారులు అక్రమంగా ఓ భవనాన్ని కూల్చివేశారని పేర్కొన్నాడు.

కూల్చేయండి ..

అయితే ఆ భవనాన్ని కూల్చివేయాలని యాజమాని కార్పొరేషన్ కోరడం విశేషం. అయితే అందులో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే తన కాల్ లిప్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అయితే తనను మళ్లీ సంప్రదించకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపగించుకున్న ఆకాశ్ .. మున్సిపల్ అధికారిపై చేయిచేసుకున్నాడు.

ఏం జరిగిందంటే ..

ఏం జరిగిందంటే ..

భవనాల కూల్చివేత జరుగుతుండగా .. ఆపాలని ఎమ్మెల్యే కోరితే లంచం అడిగారని బీజేపీ నేత హితేశ్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. దీంతో అధికారులపై కోపమొచ్చి దాడి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యేనే అధికారి లంచం అడిగారని .. అందుకే దాడి చేశారని సమర్థించుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. 'మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి, 5 నిమిషాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలని .. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి‘ అని ఎమ్మెల్యే ఆకాశ్ అన్నారు. అధికారిపై దాడి చేసినందుకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టి .. అరెస్ట్ చేశారు.

English summary
madhya Pradesh BJP MLA Akash Vijayvargiya, who is the son of veteran party leader Kailash Vijayvargiya thrashed a civic worker in Indore with a cricket bat in full public glare. The BJP MLA went about beating up the officer even as media persons surrounded him with cameras and recorded the entire incident. The municipal corporation officer who the BJP leader thrashed was in the area to carry out an anti-encroachment drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X