వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టంగా సెక్స్ మార్పిడి.. అబ్బాయితో సహజీవనం.. మర్మాంగం దెబ్బతినడంతో దారుణం

|
Google Oneindia TeluguNews

మగపిల్లాడిగా పుట్టినప్పటికీ.. టీనేజ్ వచ్చేసరికి తనలో ఆ లక్షణాలు లేవని తెల్సుకున్నాడు.. ఇకపై అమ్మాయిగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు.. ఎంతో ఇష్టంతో సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు.. రూపంతోపాటు పేరు కూడా 'పాలక్'అని మార్చేసుకున్నాడు.. ఆమెగా మారిన అతను ఓ అబ్బాయిని ఇష్టపడ్డాడు.. పెద్దల్ని ఎదిరించిమరీ అతనితో సహజీవనం చేసి పెండ్లిచేసుకున్నాడు.. హ్యాపీగా సాగిపోతోందనుకున్న జీవితంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది..

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ కు చెందిన పాలక్.. తన భర్తతో కలిసి చందన్ నగర్ ఏరియాలో నివసిస్తోంది. శనివారం రాత్రి అనుమానాస్పద రీతిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పాలక్ భర్తను ప్రశ్నించిన పోలీసులు.. వాళ్లుంటున్న ఫ్లాట్ అణువణువూ పరిశీలించారు. అక్కడ దొరికిన ఆధారాలు, బాడీ పోస్ట్ మార్టమ్ వివరాలతో పోల్చినప్పుడు ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి..

డాక్టర్లు ఆ మాట చెప్పడంతో..

డాక్టర్లు ఆ మాట చెప్పడంతో..

సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న కొన్నేళ్ల తర్వాత పాలక్ కు ఆరోగ్య సమస్యలు మొదలైనట్లు ఎంక్వైరీలో తేలిందని ఎస్ఐ సరేశ్ బంకర్ చెప్పారు. పాలక్ భర్త కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలిపారు. హెల్త్ క్రమంగా పాడైపోతుండటంతో పాలక్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, ఆరోగ్యం బాగుపడే అవకాశంలేదని డాక్టర్లు చెప్పడంతో పూర్తిగా నీరుగారిపోయిందని, జీవితంపై ఆశలు వదిలేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.

 వికటించిన ఆపరేషన్..

వికటించిన ఆపరేషన్..

పాలక్ ఆమె మర్మాంగాలు చాలా వరకు దెబ్బతిన ఉన్నట్లు గుర్తించామని, బహుశా సెక్స్ మార్పిడి ఆపరేషన్ వికటించి ఉండొచ్చని డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రాణాల్ని నిలబెట్టుకునేందుకు పాలక్ చాలా ప్రయత్నాలు చేసిందని, ఈ క్రమంలో మరో రెండు మూడు సర్జరీలు చేయించుకున్నా ఫలితాలు రాలేదని, డబ్బులతోపాటు ఆశలు కూడా ఆవిరైపోవడంతో డిప్రెషన్ కు లోనై దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు వివరించారు.

English summary
Indore resident who had a sex reassignment surgery to become a woman allegedly committed suicide due to depression, a Madhya Pradesh police official said on Sunday. However, police have been known that the deceased was facing physical problems post-surgery
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X