• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డచ్ మహిళపై అత్యాచారయత్నం: ఇద్దరు అరెస్ట్ (వీడియో)

By Nageswara Rao
|

ఇండోర్: నెదర్లాండ్స్‌కు చెందిన 24 ఏళ్ల విదేశీ మహిళపై హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లైంగికి దాడికి యత్నించిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భారత్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు నెదర్లాండ్స్ నుంచి ఇండోర్‌కు వచ్చిన ఓ మహిళ స్థానిక హోటల్ బస్ చేసింది.

హోటల్ ఉన్న భవనంలోనే షాపింగ్ మాల్ ఉంది. సోమవారం రాత్రి మాల్‌లోని పబ్‌లో డ్యాన్స్ చేసేందుకు వెళ్లిన ఆ యువతి అనంతరం అక్కడ తన మొబైల్ ఫోన్‌ని మరిచిపోయింది. ఆ తర్వాత తిరిగి తీసుకునేందుకు వెళ్లిన ఆ యువతిపై అక్కడ పనిచేసే ఇద్దరు భద్రతా సిబ్బంది ఆమెపై అత్యాచారానికి యత్నించారు.

దీంతో ఆ యువతి గట్టిగా కేకులు వేయడంతో నిందితులిద్దరూ పరుగు తీశారు. మంగళవారం మధ్యాహ్నాం బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

English summary
The Indore Police arrested two people for harassing a Dutch woman in a mall on late Monday night. The 24-year-old woman had gone to a pub inside the mall to collect her mobile phone, which she had forgotten there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X