వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్వస్థత: జేజే ఆస్పత్రి ఐసీయూలో చేరిన ఇంద్రాణి

|
Google Oneindia TeluguNews

ముంబై: షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రానీ ముఖార్జియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి తన ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఇంద్రానీ ముఖార్జియాని జేజే ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగానే ఆమె ఆరోగ్యం క్షీనించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రానీ ముఖార్జియా ఐసీయూలో చికిత్స చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు.

 Indrani Mukerjea hospitalised, currently in CCU of JJ Hospital

కన్న కూతురైన షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రానీ ముఖార్జియా అరెస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్య గుట్టు విప్పడంతో అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణీ ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉండటంతో పోలీసులు అతడ్ని కూడా అరెస్ట్ చేశారు.

English summary
Indrani Mukerjea, media baron and prime accused in the Sheena Bora murder case, was on Friday evening rushed to JJ Hospital in Mumbai. Indrani was rushed to the emergency ward of JJ Hospital from Byculla prison in a delirious condition, said reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X