వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె గొంతుకు దుప్పట్టా బిగించి ఈడ్చుకెళ్లారు: మహిళా ఖైదీ మృతిపై ఇంద్రానీ

కోర్టుకు హాజరైన ఇంద్రానీ మంజుల మృతిపై సాక్ష్యం చెప్పింది. తమ పక్క సెల్ లోనే ఉండే మంజుల గొంతుకు చీర చుట్టి సూపరిండెంట్ అధికారిణి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లిందని, ఈ దృశ్యాన్ని తాను,

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై బైకుల్లా జైల్లో మంజుల షెత్యె అనే మహిళా ఖైదీ మృతి పట్ల అక్కడి ఖైదీలంతా తీవ్ర ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫాస్ట్ తక్కువగా పెట్టారని జైలు అధికారిణుల్ని ప్రశ్నించినందుకు.. చిత్రహింసలు పెట్టి మరీ ఆమెను హత్య చేసినట్లుగా ఖైదీలు ఆరోపిస్తున్నారు.

<strong>మహిళా ఖైదీ మర్మాంగంలో లాఠీ దూర్చి చిత్రహింసలు.. ముంబైలో ఘోరం..</strong>మహిళా ఖైదీ మర్మాంగంలో లాఠీ దూర్చి చిత్రహింసలు.. ముంబైలో ఘోరం..

నలుగురైదుగురు కానిస్టేబుల్స్ కలిసి ఆమె మర్మాంగంలో లాఠీను దూర్చి తీవ్రంగా హింసించినట్లు ఖైదీలు ఆరోపించారు. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ముంబై కోర్టు దీనిపై వాదనలు వింది. బైకుల్లా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న ఇంద్రానీ కూడా కోర్టుకు హాజరై తన వాదనను వినిపించింది.

Indrani Mukerjea Wants To Detail Co-Prisoner's Alleged Sex Assault, Death

మంజుల హత్యపై ఖైదీలు ఆందోళన చేసిన సమయంలో.. ఇంద్రాణి కూడా అందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జైలు అధికారులు ఇంద్రానీపై కూడా దాడి చేసినట్లు ఆమె తరుపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వాదనలు వినిపించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

కాగా, కోర్టుకు హాజరైన ఇంద్రానీ మంజుల మృతిపై సాక్ష్యం చెప్పింది. తమ పక్క సెల్ లోనే ఉండే మంజుల గొంతుకు దుప్పట్టా బిగించి సూపరిండెంట్ అధికారిణి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లిందని, ఈ దృశ్యాన్ని తాను, తన సహచర ఖైదీలం తలుపు రంధ్రంలోంచి చూశామని పేర్కొంది.

ఈ విషయం బయటకు పొక్కితే తమకూ అలాంటి గతే పడుతుందని బెదిరించినట్లు ఆమె తెలపడం గమనార్హం. బాధితురాలి పట్ల అమానవీయంగా ప్రవర్తించడాన్ని తాను కళ్లారా చూశానని ఇంద్రానీ తెలిపారు. కాగా, ప్రస్తుతం షీనా బోరా హత్య కేసులో ఇంద్రానీ బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

English summary
Former media entrepreneur Indrani Mukerjea, who is in jail in Mumbai on charges of murdering her daughter, says that she has crucial information about how an inmate at the same prison, Manjula Shetye,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X