వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా ప్రమాణం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:సీనీియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా శుక్రవారంనాడు ఇందు మల్హోత్రాను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు.

న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న ఓ మహిళను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం ఇదే తొలిసారి. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పని చేసిన మహిళల్లో ఇందు మల్హోత్రా ఏడవవారు.

Indu Malhotra Takes Oath As Supreme Court Judge Amid Row Over Appointments

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఫాతిమా బీవీ, జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధ మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ ఆర్. భానుమతి ప్రస్తుతం పనిచేస్తున్నారు.

సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో ఇందు మల్హోత్రా పేరును న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. బుధవారం ఆ సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.. ఈ మేరకు శుక్రవారం నాడు ఇందు మల్హోత్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణం చేసింది.

English summary
Senior lawyer Indu Malhotra was administered oath of office by Chief Justice Dipak Misra this morning, making her the first woman lawyer to be directly appointed as a Supreme Court judge. Ms Malhotra was one of the two people recommended by the collegium - a group of top judges - to be elevated to the top court bench. Her appointment comes amid a row over the government's rejection of Uttarakhand Chief Justice KM Joseph's elevation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X