వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమాహేమీల మధ్య ఉద్ధవ్ ప్రమాణం: స్పెషల్ అట్రాక్షన్..ముఖేష్ అంబానీ ఫ్యామిలీ..సోనియా, రాహుల్ డుమ్మా

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలోని శివాజీ పార్కులో వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు ఆయన 19వ ముఖ్యమంత్రి. శివసేన నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో నాయకుడు. థాకరేల కుటుంబం నుంచి తొలి నాయకుడు. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీల నుంచీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఉద్ధవ్ థాకరేకు అభినందనలను తెలిపారు.

మహారాష్ట్రలో థాకరే శకం: ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం: మరో ఆరుమంది..!మహారాష్ట్రలో థాకరే శకం: ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం: మరో ఆరుమంది..!

భార్య, కుమారుడితో కలిసి ముఖేష్ అంబానీ..

భార్య, కుమారుడితో కలిసి ముఖేష్ అంబానీ..

ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి పారిశ్రామిక దిగ్గజం, బిగ్ షాట్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీలతో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం వేదికపై ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఆసీనులయ్యారు. నీతా అంబానీ, అనంత్ అంబానీ వీవీఐపీల కోసం కేటాయించిన గ్యాలరీలో కూర్చున్నారు.

 దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు.. సోనియా, రాహుల్ డుమ్మా

దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు.. సోనియా, రాహుల్ డుమ్మా

ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు, మాజీమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాత్రం దీనికి డుమ్మా కొట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ హాజరు కాలేదు.

లేఖలతో సరి..

లేఖలతో సరి..

ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే స్వయంగా న్యూఢిల్లీలో సోనియా గాంధీని కలిసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. అయినప్పటికీ.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. ఉద్ధవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సోనియాగాంధీ, రాజీవ్ గాంధీ లేఖలు రాశారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఉద్ధవ్ కు అభినందనలను తెలియజేస్తూ లేఖ రాశారు.

సోదరుడి హాజరు

సోదరుడి హాజరు

ఉద్దవ్ థాకరే సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమతి అధ్యక్షుడు రాజ్ థాకరే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్ నాథ్, అహ్మద్ పటేల్, ప్రఫుల్ పటేల్, డీఎంకే అధినేత ఎం కే స్టాలిన్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి టీఆర్ బాలు సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Former Prime Minister Manmohan Singh, Congress Interim President Sonia Gandhi, leaders of all national parties, Uddhav's estranged cousin & MNS chief Raj Thackeray, Chief Ministers of many opposition states, members of the judiciary, civil, police and defence officials, diplomatic corps stationed in Mumbai, films and sports personalities, industrialist Mukesh Ambani & his wife Neeta, celebs and more than 500 farmers and farm widows, witnessed the oath ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X