చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

#INDvENG: తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

Click here to see the BBC interactive

చెన్నైలో జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో 227 రన్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

భారత్ 420 రన్ల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టింది. అయితే 192 రన్లకే వెనుదిరగాల్సి వచ్చింది. జట్టును ముందుకు నడిపించేందుకు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ప్రయత్నించారు. ఆయన 72 రన్లు కొట్టారు. అయితే, వరుసగా వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

ఇంగ్లండ్ బౌలర్లు లీచ్ నాలుగు వికెట్లు, ఆండర్సన్ మూడు వికెట్లు తీశారు.

కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఏకంగా 578 రన్లు కొట్టింది. భారత్ 337 రన్లు కొట్టింది. దీంతో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేనాటికి ఇంగ్లండ్ 241 రన్ల లీడ్‌లో ఉంది.

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ చక్కటి బౌలింగ్ వేయడంతో 178 రన్లకే ఇంగ్లండ్‌ను కట్టడి చేయగలిగారు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ వల్ల భారత్ లక్ష్యం 420గా మారింది.

నాలుగో రోజు పూర్తయ్యేనాటికి 39 రన్లతో భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. అయితే, ఐదో రోజు భారత్‌కు కలిసిరాలేదు. వరుసగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున వికెట్లు పడుతూనే ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన చతేశ్వర్ పుజారా 15 రన్లకే అవుట్ అయ్యారు.

శుభమ్ గిల్ కాస్త మెరుగైన ప్రదర్శనతో అర్ధ శతకం కొట్టారు. అయితే, జేమ్స్ ఆండర్సన్ ఆయన వికెట్ తీశారు. అజింక్య రహాణె ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు.

తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన రిషబ్ పంత్ కేవలం 11 రన్లు మాత్రమే కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఖాతా తెరవలేకపోయాడు. కోహ్లీతో కలిసి ఆర్ అశ్విన్ క్రీజులో నిలబడగలిగాడు. వీరిద్దరూ కలిసి 54 రన్లు కొట్టారు. అయితే, దీనిలో అశ్విన్ కొట్టింది తొమ్మిది రన్లే.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
England win first Test against India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X