• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గత ఐదేళ్లతో పోలిస్తే మృతి చెందిన పిల్లల సంఖ్య తక్కువే: కోటా ఘటనపై అశోక్ గెహ్లాట్

|

కోటా: రాజస్థాన్‌లో కోటా ప్రాంతంలో ఉన్న జేకే లోన్ చిన్నపిల్లల హాస్పిటల్‌లో అప్పుడే పుట్టిన శిశువుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ సంఖ్య 104కు చేరడంతో ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడారు. హాస్పిటల్‌లో తలెత్తిన పరిస్థితిని ఆయన వివరించారు. ఈ నెల తొలి రెండు రోజుల్లోనే నలుగురు చిన్నారులు మృతి చెందారు. జిల్లా హాస్పిటల్‌లో సరైన వసతులు, సదుపాయాలు, పరికరాలు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వంద మందికి చేరిన కోటా ఆస్పత్రి మృతుల సంఖ్య, ముగ్గురికి ఒకే బెడ్, తక్కువ బరువుతో జననం...

పిల్లల మృతిపై రాజకీయం వద్దు

కోటా హాస్పిటల్ పరిస్థితులపై కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు సీఎం అశోక్ గెహ్లాట్. దీన్ని రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు.గత ఐదారేళ్ల కిందటితో పోలిస్తే మృతుల సంఖ్య చాలా తక్కువ అని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే ఒక్క బిడ్డ అయినా సరే ఎందుకు మృతి చెందాలని అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తోందని అన్ని చర్యలు తీసుకుంటామని అశోక్ గెహ్లాట్ చెప్పారు. అయితే ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

పిల్లలను కోల్పోయిన తల్లులను ప్రియాంకా పరామర్శించాలి

పిల్లలను కోల్పోయిన తల్లులను ప్రియాంకా పరామర్శించాలి

ఇంత మంది శిశువులు మరణిస్తున్నప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వంకు చీమకుట్టినట్లయినా లేదని ఎద్దేవా చేశాయి ప్రతిపక్షపార్టీలు. రాజస్థాన్‌లో మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులను ప్రియాంకా గాంధీ పరామర్శించాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి చెప్పారు. వారిని పరామర్శించకుండా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పోరాడిన వారి కుటుంబాలను పరామర్శిస్తే ఇది రాజకీయ లబ్ధి కోసమే అని భావించాల్సి ఉంటుందన్నారు బెహెన్‌జీ.

ఎయిమ్స్ నుంచి కోటాకు నిపుణుల బృందం

ఎయిమ్స్ నుంచి కోటాకు నిపుణుల బృందం

ఇదిలా ఉంటే ఎయిమ్స్ నుంచి ఒక నిపుణుల బృందాన్ని కోటాకు పంపాలని కేంద్రం భావిస్తోంది. ఈ బృందంలో ఆర్థికవేత్తలు కూడా ఉంటారని ... జేకే లోన్ హాస్పిటల్‌లో ఉన్న మౌళిక సదుపాయాలను వీరు సమీక్షిస్తారని కేంద్రం చెబుతోంది. అంతేకాదు ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు నిధులు ఏమేరకు అవసరం అవుతాయనేది వీరు అంచనా వేస్తారు. ఈ బృందం శనివారం కోటాకు చేరుకుంటుంది. మరోవైపు రాజస్థాన్‌లో కోటా హాస్పిటల్ చిన్నారుల మృతిపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

ప్రియాంకా సోనియా గాంధీలపై యోగీ ట్వీట్

ఉత్తర్ ప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబాల పరామర్శకు ప్రియాంకా గాంధీ వచ్చారని.. అయితే సోనియాగాంధీ ప్రియాంకా గాంధీ ఇద్దరూ మహిళలై ఉండి వారికి ఇతర తల్లులు ఆవేదన తెలియడం లేదని ట్వీట్ చేశారు. డిసెంబర్ 23-24వ తేదీల్లో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం జేకే లోన్ హాస్పిటల్‌ను సందర్శించి నివేదిక తయారు చేసింది. హాస్పిటల్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని నివేదికలో పేర్కొంది. అంతేకాదు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆక్సిజన్ సరఫరా కోసం పైపులు ఇతరత్ర పరికరాలు హాస్పిటల్‌లో కనిపించలేదని నివేదిక ఇచ్చింది. శిశువుల మరణాలకు డాక్టర్లది తప్పిదం లేదని వైద్యులకు క్లీన్ చిట్ ఇచ్చింది కమిటీ.

English summary
Rajasthan Chief Minister Ashok Gehlot said on Friday that the Kota infants' death toll has been the lowest as compared to the last five-six years. At least four more infants have died in the first two days of January at the JK Lon hospital in Kota, taking the death toll to 104.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X