వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నియంత్రణలోనే ఉన్న ద్రవ్యోల్బణం

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, అదేసమయంలో రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ.. మోడీ సర్కార్ ద్రవ్యోల్బణాన్ని మాత్రం నియంత్రిస్తూ శభాష్ అనిపించుకుంది. మంచి పంటలు, దిగుబడి రావడంతో ఆహార ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో ఇది ప్రభుత్వానికి కొంత సహాయపడిందనే చెప్పొచ్చు. గత నెల సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ 5.13శాతం పెరిగింది.ఇది ఆగష్టులో 4.53శాతంగా ఉన్నింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టోకు ధరల సూచీ ఏడాది పెరుగుదల 4.98శాతంగా ఉంది. ఇదిలా ఉంటే వినియోగదారుల ధరల సూచీ మాత్రం 3.88శాతానికి ఇదే సమయంలో పెరిగింది. ఇది గత మూడు త్రైమాసికాల్లో 4శాతంగా ఉన్నింది. ద్రవ్యోల్బణం పెరగినప్పటికీ అది మరీ ప్రమాదకర స్థాయికి చేరలేదు. ఇది ముడిచమురు ధరలు పెరుగుతున్న క్రమంలో ద్రవ్యోల్బణం పెరగకపోవడం శుభపరిణామమే అని చెప్పాలి.

Inflation under check despite sharp rise in crude prices

ద్రవ్యోల్బణం అంటే మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే... దానర్థం ధరలు కూడా ప్రభుత్వం అధీనంలో ఉన్నట్లే లెక్క. ఇది వినియోగదారులకు శుభవార్తే అయినప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం ప్రభుత్వానికి చేదు వార్తే. ఆహార పదార్థాలపై ధరలు ప్రభావం ఎక్కువగా ఉందంటే... వాటిని తగ్గించి ప్రజలకు అదించాలి. ఈ క్రమంలో ప్రభుత్వమే అదనంగా భరించాల్సి ఉంటుంది. అంటే రైతులకు కొన్ని పంటలకు పరిహారం చెల్లిస్తుంది. కనీస మద్దతు ధర విధానంలో భాగంగానే ఇదంతా ప్రభుత్వం చేస్తుంది. 2022కల్లా వ్యవసాయ రంగంలో లాభాలు రెట్టింపు కావాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ పనిచేస్తోంది.

Inflation under check despite sharp rise in crude prices

ఇక బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు పక్కన బెడితే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే వినియోగదారులకు చాలా మంచింది. వరి, పాలు, నూనె విత్తనాల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే... ధాన్యాలు,గోదుమలు, ఆలుగడ్డలు వరుసగా 5.54శాతం, 8.87 శాతం,80.13 శాతంగా పెరిగాయి. ఉల్లి, గుడ్లు, మాంసం హోల్‌సేల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం తగ్గుతూ కనిపించింది. అంతేకాదు ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉండదని చాలామంది భావించారు. ముడిచమురు ధరల్లో పెరుగుదల కనిపించిందంటే ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంది.

Inflation under check despite sharp rise in crude prices

2014 సాధారణ ఎన్నికలకు ముందు ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతూ రెండంకెలకు చేరుకుంది. యూపీఏ-2 సమయంలో ఆహార ధరలు పెరిగిపోతుండటంతో ద్రవ్యోల్భణం కూడా నియంత్రణ కోల్పోయింది. 2014 తర్వాత ఇది పూర్తి భిన్నంగా తయారైంది. మోనిటరీ విధానాల అంచనాలను హోల్‌సేల్ టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. ఇప్పుడు వినియోగదారుడి ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా విధానాలను అంచనా వేస్తోంది రిజర్వ్ బ్యాంక్.

English summary
Considering sharp rise in crude prices and falling value of the Rupee, the Narendra Modi-led NDA government has done a decent job to keep the inflation under check so far. What has helped the government is that good harvest and increased farm output has brought the food prices down. India's Wholesale Price Index (WPI) or wholesale inflation surged to 5.13% in September 2018 from 4.53% in August this year. The annual growth in wholesale price index (WPI) in the quarter ending September 2018 was 4.98%. The Consumer Price Index (CPI) grew at 3.88% in this period, after having grown at more than 4% in the last three quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X