వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీ ట్రాప్: పాక్ ఐఎస్ఐ గూడచారులు అరెస్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమ్మాయి వలలో పడిన యువకుడు తన స్నేహితుడితో కలిసి భారత ఆర్మీ రహస్యాలు, సైనికుల దినచర్యలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్ కు పంపిస్తున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

పాకిస్థాన్ అమ్మాయి హనీ ట్రాప్ లో పడి దేశద్రోహానికి పాల్పడ్డాడని గుజరాత్ ఉగ్రవాద నిరోదక దళం (ఏటీఎస్) అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో అలన హమీర్, షాకూర్ సుమర అనే ఇద్దరిని ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరినీ విచారించగా పలు విషయాలు బయటకు వచ్చాయని అధికారులు చెప్పారు. హమీర్, షాకూర్ ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ కు రహస్య గూడచారులుగా పని చేస్తున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Information on Indian army movement shared with Pakistan for the lure of wealth and women

సరిహద్దుల్లో భారత సైనిక దినచర్యలు గమనిస్తూ ఎప్పటికప్పుడు ఐఎస్ఐకి సమాచారం ఇస్తున్నారని ఏటీఎస్ అధికారులు అంటున్నారు. ఇంటిలిజెన్స్, స్థానిక పోలీసులకు సరిహద్దు ప్రాంతాల్లో రాడర్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.

అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన హమీర్ 2014 లో బంధువును కలుసుకోవడానికి పాకిస్థాన్ వెళ్లాడు. బంధువును కలిసిన తరువాత పాకిస్థాన్ లోని తర్పకార్ జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయిని కలుసుకున్నాడు.

ఆ అమ్మాయి హమీర్ ను వలలో (హనీ ట్రాప్) వేసుకుంది. హమీర్ ఆ అమ్మాయిని ప్రేమించాడు. హమీర్ కు పాక్ అమ్మాయి నగదు ఇచ్చింది. తరువాత ఐఎస్ఐ లీడర్లను పరిచయం చేసింది. ఐఎస్ఐ లీడర్లు హమీర్ కు పాక్ లో శిక్షణ ఇచ్చారు.

ఎలా భారత ఆర్మీ దినచర్యల వివరాలు సేకరించాలి ? వాటిని పాకిస్థాన్ కు ఎలా పంపించాలి ? అని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు చెప్పారు. అదే సందర్బంలో నీవు ఈ పని చేసి డబ్బులు సంపాధించాలని పాక్ అమ్మాయి హమీర్ ను రెచ్చగొట్టిందని అధికారులు అన్నారు.

తరువాత భారత్ చేరుకున్న హమీర్ విధ్యావంతుడైన తన స్నేహితుడు షాకూర్ తో అసలు విషయం చెప్పాడు. అప్పటి నుంచి వీరిద్దరూ ఆర్మీ దినచర్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పాక్ కు చేరవేస్తున్నారని ఏటీఎస్ అధికారులు అన్నారు.

పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐకి రహస్య గూడచారులుగా పని చేస్తున్న హమీర్, షాకూర్ నుంచి మొబైల్ ఫోన్లు, పాకిస్థాన్ సిమ్ కార్డులు, ఫోటోలు, మ్యాప్ లు స్వాధీనం చేసుకున్నామని, అధికారుల రహస్యాలు సేకరించి పాక్ కు చేరవేసి దేశద్రోహం చేస్తున్నారని కేసులు నమోదు చేశామని గుజరాత్ ఏటీఎస్ అధికారులు తెలిపారు.

English summary
Hamir had visited Pakistan in 2014 to meet with a relative. During his visit to Tharparkar district in Pakistan he met a 17 year old girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X