వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు ఇన్పోసిస్ షాక్: వేతనాల పెంపు వాయిదా, ఫెర్ ఫామెన్స్ లేకపోతే ఇంటికే?

సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకొనేందుకుగాను టెక్ దిగ్గజ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగానే ఉద్యోగాలపై కోత పెడుతున్నాయి.మరో వైపు ఉన్న ఉద్యోగులకు వేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకొనేందుకుగాను టెక్ దిగ్గజ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగానే ఉద్యోగాలపై కోత పెడుతున్నాయి.మరో వైపు ఉన్న ఉద్యోగులకు వేతనాల పెంపు విషయాన్ని వాయిదావేస్తున్నాయి. ఇన్సోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది.మరో వైపు ఉద్యోగులపై వేటు ఉండబోదని చెబుతూనే ఫెర్ ఫామెన్స్ ఆధారంగానే నిర్ణయం ఉంటుందని ఆ సంస్థ మెలిక పెట్టింది.

ఉద్యోగాల కోతపై తీవ్ర భయాందోళనలు రేకెత్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఇన్పోసిస్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోత భయాందోళనలు ఉండవని తేల్చి చెప్పింది.అయితే వేతనాల పెంపు ఇప్పట్లో ఉండవని ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొంటున్న మార్పుల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది.

హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలను కఠినతరం చేయడం, అమెరికాలో స్థానికులకే ఉద్యోగావకాలు కల్పించేలా చట్టంలో మార్పులు చేర్పుల వల్ల ఇండియా సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఇన్పోసిస్ లో వేతనాల పెంపు ఇప్పట్లో లేనట్టే

ఇన్పోసిస్ లో వేతనాల పెంపు ఇప్పట్లో లేనట్టే

ఇన్పోసిస్ లో వేతనాల పెంపు ఇప్పట్లో లేనట్టేనని ఆ కంపెనీ ప్రకటించింది.ఈ ఏడాది జూలై వరకు వేతనాలను పెంచే అవకాశం లేదని ఆ కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఉద్యోగాల కోత ఉండబోదని మాత్రం కొంత భరోసాను ఇచ్చింది.వేతనాల పెంపును జూలై వరకు ఉండబోదని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ప్రకటించారు. జూలై వరకు వేతనాల పెంపు కోసం ఆగాల్సిందేని సీనియర్ ఉద్యోగులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారాయన.

ఖర్చులు తగ్గించుకొనేందుకే

ఖర్చులు తగ్గించుకొనేందుకే

ఉద్యోగులకు వేతనాలు పెంచకపోవడం, ఇతరత్రా వ్యవహరాలన్నీ ఖర్చులు తగ్గించుకొనే క్రమంలోనే చేస్తున్నట్టుగా ఇన్పోసిస్ ప్రకటించింది. అయితే ప్రపంచ వ్యాపంగా సాఫ్ట్ వేర్ రంగంలో చోటుచేసుకొన్న మార్పుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఖర్చులను తగ్గించుకొనేందుకుగాను టెక్ దిగ్గజాలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇన్పోసిస్ కూడ వేతనాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది.

ఉద్యోగులపై వేటు ఉండదు,కానీ

ఉద్యోగులపై వేటు ఉండదు,కానీ

అయితే ఇన్పోసిస్ లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఒక భరోసా మాత్రం ఆ కంపెనీ ఇచ్చింది. ఉద్యోగాలనుండి తీసివేసే భయాలు ఉండబోవని ఆ సంస్థ ప్రకటించింది. వేతనాలు పెంచే విషయాన్ని పక్కనపెడితే ఉద్యోగాలు ఉంటే చాలనే పరిస్థితులో ఉన్నారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ తరుణంలో ఇన్పోసిస్ ఈ నిర్ణయం ప్రకటించడం కొంత ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్వాంతన చేకూరుస్తోంది.ఉద్యోగాల కోతకు తాము ఎలాంటి ప్లాన్ చేయడం లేదని యూబీ ప్రవీణ్ రావు ప్రకటించారు.అయితే అందులో మాత్రం ఫెర్ ఫామెన్స్ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించింది కంపెనీ.వరుసగా తమ ఫెర్ ఫామెన్స్ సక్రమంగా లేని ఉద్యోగులపై చర్యలు తీసుకొంటామని ఆ కంపెనీ ప్రకటించింది.

.జూనియర్ లెవల్ ఉద్యోగుల సమీక్ష జూలై నుండి

.జూనియర్ లెవల్ ఉద్యోగుల సమీక్ష జూలై నుండి

ఎనిమిదేళ్ళ కంటే తక్కువ అనుభవం ఉన్న జాబ్ లెవెల్ ఐదు ర్యాంకుల ఉద్యోగుల పరిహారాల సమీక్ష జూలై నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవీణ్ రావు తమ ఉద్యోగులకు ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు పరిహారాల సమీక్ష తర్వాతి క్వార్టర్ లో ఉంటుందని ఆయన ఈ లేఖలో ప్రకటించారు. వేతనాల పెంపు ఆలస్యం ఒకటి లేదా రెండు క్వార్టర్ల మార్జిన్లను కాపాడుకొనేందుకేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

సీనియర్లు ఇక ఇంటికేనా?

సీనియర్లు ఇక ఇంటికేనా?

సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు ఆలస్యమనేది వారు ఇతర ఉద్యోగాలు చూసుకొనే స్థాయికి దారితీస్తోందనే ముంబై బ్రోకరేజ్ కు చెందిన ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఉద్యోగంలో అభద్రతా వాతావరణాన్ని కల్పిస్తోందని చెప్పారు. ఇటీవల టెక్ కంపెనీల్లో భాగంగా భారీగా లే ఆప్స్ తో ఉద్యోగులు సతమతమౌతున్నారు. ఇన్పోసిస్ సైతం వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. కానీ, తాము ఎలాంటి ప్లాన్ చేయడం లేదని రెగ్యులర్ ఫెర్ ఫామెన్స్ ఆధారంగానే కొందరు వైదొలగాల్సి వస్తోందని సంస్థ ప్రకటించింది.

English summary
Infosys has delayed salary hikes increases to at least july and even later for senior employees.It played down fears of job cuts and started taking steps to reduce operating costs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X