వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రస్సెల్స్: ఇన్ఫోసిస్ ఉద్యోగి గల్లంతు, నిందితుడి అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బ్రెస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఎయిర్ పోర్ట్‌లో మంగళవారం మధ్యాహ్నాం సంభవించిన పేలుళ్లో ఇన్ఫోసిస్‌కు చెందిన రాఘవేంద్రన్ గణేశ్ అనే ఉద్యోగి గల్లంతయ్యారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ అధికారికంగా వెల్లడించింది. దీంతో రాఘవేంద్రన్‌ ఆచూకీ కోసం బెల్జియంలోని ఇండియన్ ఎంబసీ అధికారులు గాలిస్తున్నారు.

రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అతని జాఢ ఇంకా తెలియరాలేదని బెల్జియంలోని భారత రాయబారి మంజీవ్ పూరి చెప్పారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రాఘవేంద్రన్ గణేశ్ ఆచూకీ కోసం బెల్జియంలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఐసీస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్ల ఘటనలో 35 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.

రాజ‌ధాని బ్రసెల్స్‌లో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో అక్క‌డి భారతీయులు క్షేమంగా ఉన్నార‌ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. పేలుళ్ల‌పై ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. అక్క‌డి పరిస్థితిని ఎప్పటిక‌ప్పుడూ తెలుసుకుంటున్నామని చెప్పారు.

 Infosys Employee Missing After Attacks In Belgium

పేలుళ్లలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన భారతీయ మహిళా ఉద్యోగి గాయపడిందని, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సుష్మ తెలిపారు. కాగా జెట్ ఎయిర్‌వేస్ మాత్రం ఇద్దరు మహిళా సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. అయితే తాజాగా రాఘవేంద్రన్ గణేశ్ విషయం బయటపడింది.

ఇది ఇలా ఉంటే బ్రస్సెల్స్‌లో నాజిమ్ అనే మరో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్, మెట్రో స్టేషన్‌లో ఉగ్రదాడికి పాల్పడింది మొత్తం ముగ్గురిని ఇప్పటికే గుర్తించారు. ఎయిర్‌పోర్ట్‌ సిసిటీవీల్లో రికార్డైన దృశ్యాల ద్వారా వీరిని గుర్తించారు.

కాగా ఖాలిద్, బ్రాహీం అనే ఉగ్రవాదులు తమను తాము పేల్చి వేసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. పేలుళ్ల తర్వాత ఘటనాస్థలం నుంచి తప్పించు కున్న నాజిమ్‌ను బ్రాస్సెల్స్‌లో అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వద్ద పేలుడుకు యత్నించి విఫలమవడంతో అది వదిలిపెట్టి నాజిమ్ పారిపోయాడు. బుధవారం అతడిని బ్రస్సెల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
An Indian missing since the Brussels attacks on Tuesday has been identified as Raghavendra Ganeshan, an Infosys employee who works in the Belgian city. The Indian embassy is making all efforts to establish contact with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X