వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవింద్ కేజ్రీవాల్ పార్టీలోకి ఇన్ఫోసిస్ మాజీ బాలకృష్ణన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Infosys ex-board member Balakrishnan joins AAP
బెంగళూరు: సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించి ఇటీవలె వైదొలగిన వి బాలకృష్ణన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి)లో చేరారు. తాను ఎఎపిలో చేరిన విషయాన్ని బాలకృష్ణన్ బుధవారం ధ్రువీకరించారు.

బాలకృష్ణన్ అనూహ్యంగా ఎఎపిలో చేరడం గమనార్హం. రాజకీయాల్లో ఎఎపి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని ఆయన పేర్కొన్నారు. అందుకే వారితో కలిసి పని చేసేందుకు తాను సిద్ధపడ్డానన్నారు. భవిష్యత్తులో వ్యాపారంతో పాటు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పారు.

తనకు వ్యాపారాన్ని, రాజకీయాన్ని రెండింటిని మేనేజ్ చేయగలనని విశ్వాసముందన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోకసభకు పోటీ చేస్తారా అని అడిగితే... దానిపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందన్నారు.

ఇన్ఫోసిస్ సిఈవో పదవికి పోటీదారుల్లో ఒకరిగా భావించిన బాలకృష్ణన్ గత నెల 20న కంపెనీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ 1991లో ఇన్ఫోసిస్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రేసులోను ఆయన ఉండగా ఆ కంపెనీ నుండి బయటకు వచ్చారు.

English summary
In a surprise move, V Balakrishnan, who stepped down as Board member of software behemoth Infosys recently creating ripples in the corporate circles, has joined the Aam Admi Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X