వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాల్ సిక్కా రాజీనామా ఎఫెక్ట్: పాతాళానికి పడిపోయిన ఇన్ఫోసిస్ ఈక్విటీ

ఇన్ఫోసిస్‌ కు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా రాజీనామా చేశారన్న వార్త తెలియగానే సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ కు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా రాజీనామా చేశారన్న వార్త తెలియగానే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది.

ఇన్ఫోసిస్‌లో సంచలనం: విశాల్‌ సిక్కా అవుట్‌! మూర్తి వస్తారా? చక్కదిద్దుతారా?ఇన్ఫోసిస్‌లో సంచలనం: విశాల్‌ సిక్కా అవుట్‌! మూర్తి వస్తారా? చక్కదిద్దుతారా?

ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే కిందకు జారిపోయిన ఇన్ఫోసిస్‌ ఈక్విటీ, ఉదయం 9:55 గంటల సమయంలో 7 శాతానికి పైగా నష్టంలో కొనసాగుతోంది.

Infosys falls 7% after Vishal Sikka resigns as MD & CEO

ఇటీవలి కాలంలో తొలిసారిగా సంస్థ ఈక్విటీ విలువ రూ. 950 స్థాయి వద్ద మద్దతు కోల్పోయింది. ప్రస్తుతం సంస్థ వాటా విలువ రూ. 946 వద్ద కొనసాగుతోంది. సిక్కా రాజీనామా నిర్ణయం ఇన్ఫీపై పెను ప్రభావాన్నే చూపిందని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇక బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 0.7 శాతం పడిపోయి 31,574 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇన్ఫీ ప్రభావంతో ఐటీ ఇండెక్స్ భారీ నష్టాల్లో సాగుతోంది.

English summary
Infosys has dipped 7% to Rs 958 on BSE in early morning trade after Vishal Sikka resigned as the Managing Director (MD) and Chief Executive Officer (CEO) of the company with immediate effect. “The board of directors of Infosys has at its meeting today accepted the resignation of Dr. Vishal Sikka as the Managing Director and Chief Executive Officer of the Company with immediate effect,” Infosys said in a statement. Vishal Sikka has been appointed as the Executive Vice-Chairman of Infosys. The company has appointed U B Pravin Rao as the Interim-MD and CEO, it added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X