వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించని నిర్ణయం: ఇన్ఫోసిస్ స్టాక్ అమ్మేస్తున్నారా?.. దెబ్బకు షేర్లు ఢమాల్

కంపెనీ సహ వ్యవస్థాపకులు 12.75శాతం స్టాక్ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ 28వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్టాక్ అమ్మేస్తున్నారన్న ప్రచారంతో కంపెనీ స్టాక్ కనిష్ట స్థాయికి పడిప

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: నిన్నటికి నిన్న విప్రో కంపెనీ మేనేజ్‌మెంట్ చేతులు మారబోతుందన్న ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. కంపెనీలో మేజర్ వాటా కలిగిన ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, ఆయన కుటుంబ సభ్యులు తమ వాటాలను విక్రయించడానికి నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చిన ప్రేమ్‌జీ అలాంటిదేమి లేదని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.

భారత ఐటీకి ఊహించని దెబ్బ!: విప్రోను అమ్మేస్తున్నారట!?..భారత ఐటీకి ఊహించని దెబ్బ!: విప్రోను అమ్మేస్తున్నారట!?..

తాజాగా మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ విషయంలోను అలాంటి వార్తే తెర పైకి వచ్చింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయించడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. స్టాక్ మొత్తం అమ్మేయాలని వారు నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియదు గానీ ఈ ప్రభావంతో కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో కంపెనీ షేర్ 3.47శాతం మేర పడిపోయినట్లు సమాచారం.

Infosys founders looking to sell their stake in company

కాగా, కంపెనీ సహ వ్యవస్థాపకులు 12.75శాతం స్టాక్ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ 28వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్టాక్ అమ్మేస్తున్నారన్న ప్రచారంతో కంపెనీ స్టాక్ కనిష్ట స్థాయికి పడిపోయింది. మే5 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి అని రిపోర్టులు చెబుతున్నాయి.

''అతిగా భయపెట్టారు.. ఆందోళన వద్దు, ఈ ఏడాది ఒక్క ఇన్ఫోసిస్ లోనే 20 వేల ఉద్యోగాలు''''అతిగా భయపెట్టారు.. ఆందోళన వద్దు, ఈ ఏడాది ఒక్క ఇన్ఫోసిస్ లోనే 20 వేల ఉద్యోగాలు''

మరోవైపు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. స్టాక్ అమ్మకం ప్రచారాన్ని ఆయన కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు సమాచారం. కార్పోరేట్ గవర్నెర్స్‌పై ఇప్పటికే పలుమార్లు బోర్డు సభ్యులను మందలించినా.. వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదని చెబుతున్నారు.

ఖండించిన ఇన్ఫోసిస్:

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ స్టాక్ అమ్మేయాలనుకుంటున్నారన్న ప్రచారాన్ని ఆ సంస్థ యాజమాన్యం ఖండించింది. దయచేసి ఇటువంటి నిరాధార వార్తలకు మీడియా ప్రాధాన్యం కల్పించవద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ప్రచారం వల్ల కంపెనీతో పాటు స్టాక్ హోల్డర్స్ నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

English summary
An era in Indian corporate history might be drawing to a close. The much-celebrated co-founders of Infosys are exploring a sale of their entire 12.75% stake in the company worth about Rs 28,000 crore, people familiar with the development said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X