వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌లో వేతన పెంపు అంతే, అదే దారిలో విప్రో

ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇన్ఫోసిస్ వేతన పెంపును క్వార్టర్ పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇన్ఫోసిస్ వేతన పెంపును క్వార్టర్ పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది.

సగటున ఉద్యోగికి 5 శాతం మాత్రమే పెంపును చేపట్టింది. బాగా పని చేసిన వారికి 12 శాతం వరకు ఇస్తుంది. విప్రో కూడా ఇదే మేర పెంపును చేపడుతున్నట్లుగా వెల్లడైంది.

జాబ్ లెవల్ 6 ఉద్యోగుల, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగుల సమీక్షించిన వేతన పరిహారాలు జూలై నుంచి అమలులోకి వస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్ నెలలో కంపెనీ ఇంక్రిమెంట్లు చేపడుతుంది.

Infosys gives 5 per cent average increment

కానీ ఈసారి పరిశ్రమలో నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో క్వార్టర్ కాలం ఇంక్రిమెంట్లను వాయిదా వేసింది. ఈ ఇంక్రిమెంట్లు గత ఏడాది కంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Recommended Video

గత ఏడాది 6-12 శాతం మధ్యలో ఇంక్రిమెంట్లు ఇచ్చింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అసలు కంపెనీ ఇంక్రిమెంట్లనే చేపట్టడం లేదని అంటున్నారు.

కొత్త పని తీరు నిర్వహణ, వ్యవస్థ అకౌంట్ ద్వారా వ్యక్తిగతంగా ఓ ఉద్యోగి సహకారం ఏ మేరక ఉంటుందో తెలుసుకోవడం కోసం కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది. ఫీడ్ బ్యాకులను కూడా కంపెనీ నిత్యం తీసుకుంటోంది. కంపెనీలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి 10 నుంచి 12 శాతం మధ్యలో ఉండనున్నాయి.

English summary
Infosys is giving an average salary increment of 5 per cent to its employees in India, similar to that offered by Wipro.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X