వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఇన్సోసిస్ ను వీడిన 38 వేల మంది టెక్కీలు, కారణమిదే!..

ఇన్పోసిస్ లో ఇటీవల చోటుచేసుకొంటున్న పరిణామాలు ఆ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.దీంతో ఆ కంపెనీని ఇప్పటికే 38 వేల మంది టెక్కీలు వీడిపోయారు. ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఇన్పోసిస్ లో ఇటీవల చోటుచేసుకొంటున్న పరిణామాలు ఆ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.దీంతో ఆ కంపెనీని ఇప్పటికే 38 వేల మంది టెక్కీలు వీడిపోయారు. ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకొన్నారు.

ధేశీయంగా ఇన్పోసిస్ టాప్ ప్లేస్ లో ఉంది. దేశీయ ఐటీ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఇన్పోసిస్ ఒకటి.అయితే ఇన్పోసిస్ లో నెలకొన్న పరిణామాలు ఆ సంస్థలో పనిచేస్తోన్న టెక్కీలపై ప్రభావం చూపుతున్నాయి.

ఇన్పోసిస్ వ్యవహరాలు ఇటీవల కాలంలో రచ్చకెక్కాయి.కంపెనీ వేతన విషయంలో నెలకొన్న లుకలుకలు, భారీగా తగ్గిపోతున్న రిక్రూట్ మెంట్ కంపెనీ పేరును దెబ్బతీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలు కూడ ఐటీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఈ ప్రభావం ప్రధానంగా భారత్ లోని ఐటీ పరిశ్రమలపై ఎక్కువగా ఉంది.

ఇన్సోసిస్ ను వీడిన 38 వేల మంది టెక్కీలు

ఇన్సోసిస్ ను వీడిన 38 వేల మంది టెక్కీలు

2016-17 లో ఇన్పోసిస్ ను 38 వేల మంది టెక్కీలు వీడివెళ్ళిపోయారు.అదే ఏడాది రిక్రూట్ మెంట్ కూడ 65 శాతానికి పడిపోయింది.వేతనాలతో పాటు ఇతర అంశాలు కూడ ప్రధానంగా కారణంగా నిపుణులు అంచనావేస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఆటోమెషన్ ప్రధానకారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2015-16 లో ఈ కంపెనీ నుండి సుమారు 34,688 మంది రాజీనామా చేశారు.

కొత్తగా చేరింది 6 వేల మంది మాత్రమే

కొత్తగా చేరింది 6 వేల మంది మాత్రమే

ఇన్పోసిస్ లో .2016-17 లో 44,235 మంది టెక్కీలను నియమించుకొంది.అయితే కంపెనీలోకి వచ్చింది మాత్రం కేవలం 6,320 మంది మాత్రమేనని ఇన్పోసిస్ వెల్లడించింది. పదేళ్ళకంటే ఎక్కువ అనుభవమున్న వారిని కూడ తక్కువ సంఖ్యలోనే చేర్చుకొన్నారు.కేవలం18,797 మందిని మాత్రమే చేర్చుకొన్నారని ఇన్సోసిస్ వెల్లడించింది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షలు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షలు

అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను ఇటీవల కాంలో మరో 6320కు పెంచింది సంస్థ. అయితే వీరి చేరికతో అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల 364 మందికి చేరుకొంది.ఫలితంగా పేరెంట్ కంపెనీలో ఆట్రిక్షన్ లెవల్స్ 15 శాతానికి పెరిగిందని వార్షిక సమీక్షలో ఇన్పోసిస్ వెల్లడించింది. గతేడాది 13.6 శాతం ఉంది.

ప్రాజెక్టులపై ప్రభావం

ప్రాజెక్టులపై ప్రభావం

అమెరికా అద్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ప్రధానం ఐటీ పరిశ్రమపై పడింది. భారత్ కు చెందిన ఐటీ పరిశ్రమలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. హెచ్ 1 బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు అవుట్ సోర్సింగ్ పై కూడ ఆంక్షలు విధించారు. ఈ విధానాలు కూడ ఐటీ పరిశ్రమలపై పడుతున్నాయి.ఇన్పోసిస్ ను ఉద్యోగులు వదిలివెళ్ళడానికి ఇది కూడ ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Infosys saw a whopping 37,915 engineers leave the software major while its hiring plunged 65 per cent in fiscal year 2016-17 thanks to increasing automation and thrust on artificial intelligence in its operations and projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X