వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందన్ నిలేకని రాకతో ఇన్పోసిస్ షేర్లు జంప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ఇన్పోసిస్‌లో నెలకొన్న సంక్షోభంతో ఆ సంస్థ తీవ్రంగా నష్టాల బారినపడింది. అయితే నందన్ నిలేకనీ తిరిగి ఇన్పోసిస్‌లోకి పునరాగమనం ఇన్పోసిస్ కంపెనీ ఇన్వెస్టర్లతో మంచి విశ్వాసాన్ని కల్గించింది. సోమవారం నాడు ఇన్పోసిస్ షేర్లు 5 శాతం పెరిగి రూ.9వేల కోట్లకుపైగా ఎగిసింది.

ఇన్పోసిస్ సీఈఓగా పనిచేసిన విశాల్ సిక్కా రాజీనామా చేయడంతో ఇన్వెస్టర్లతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు , మాజీ సీఈఓ నందన్ నిలేకని మళ్ళీ ఇన్పోసిస్‌లోకి అడుగుపెట్టారు.

Infosys shares jump after Nandan Nilekani named non-exec chairman

నాలుగు రోజుల క్రితం నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌గా నందన్ నిలేకని బాధ్యతలు స్వీకరించారు. లాంగ్ వీకేండ్ తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌లో నిలేకని పునరాగమనం ఇన్పీపై సెంటిమెంట్ బలపర్చింది.

నందన్ నిలేకని పునరామనం క్లయింట్స్‌లో షేర్‌హెల్డర్స్‌లో భరోసా ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు. నంన్ నిలేకని మళ్ళీ ఇన్పోసిస్‌లోకి రావడం ఆరేళ్ళకాలంలో మంచి ప్రారంభాన్ని ఇన్పీకి అందిస్తే ఇన్పీకి మంచి స్థిరత్వం వస్తోందని ఇన్వెష్టర్లు అభిప్రాయంతో ఉన్నారు.

సిక్కా రాజీనామాతో దాదాపు 15 శాతం మేర క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 30వేల కోట్లు నష్టపోయింది. తర్వాత ఇన్పీ షేర్లు మెల్లమెల్లగా కోలుకోవడం ప్రారంభించాయి.

English summary
Shares of Infosys Ltd rose as much as 4.6% on Monday, after co-founder Nandan Nilekani returned as chairman raising hopes that a months-long row between the board and the founders of the country’s second-biggest software services exporter will be resolved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X