వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫీలో అలా జరిగిందా?: నీలేకని రీఎంట్రీ వెనుక?.. ఎస్ఈఎస్ ఆరోపణలు

కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్‌ ప్రమాణాలకు విరుద్దంగా నీలేకని నియామకం జరిగిందని అడ్వజరీ సంస్థ స్టేక్‌హోల్డర్స్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వీసెస్‌(ఎస్‌ఈఎస్‌) ఆరోపించింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా నందన్‌ నిలేకని నియామకంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్‌ ప్రమాణాలకు విరుద్దంగా ఆయన నియామకం జరిగిందని అడ్వజరీ సంస్థ స్టేక్‌హోల్డర్స్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వీసెస్‌(ఎస్‌ఈఎస్‌) ఆరోపించింది.

ముందుగానే నిర్ణయించుకుని:

ముందుగానే నిర్ణయించుకుని:

బోర్డు డైరెక్టర్లతో సమావేశం నిర్వహించకుండానే ఛైర్మన్ పదవిలో నీలేకనీని కూర్చోబెట్టారని ఎస్‌ఈఎస్‌ పేర్కొంది. బోర్డుతో సంప్రదింపులు జరపకుండానే ఛైర్మన్ ను ఎంపిక చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్మన్ గా నీలేకని నియామకంపై ముందుగానే నిర్ణయం తీసుకుని ఉంటారని ఎస్‌ఈఎస్‌ ఎండీ జెఎన్‌ గుప్తా పేర్కొనడం గమనార్హం.

ఆదుకోని బై బ్యాక్: అసలేం జరిగింది?.. అమెరికా ఫోకస్, అదే తేలితే ఇన్ఫీకి దెబ్బే?ఆదుకోని బై బ్యాక్: అసలేం జరిగింది?.. అమెరికా ఫోకస్, అదే తేలితే ఇన్ఫీకి దెబ్బే?

Recommended Video

Infosys CEO and MD Vishal Sikka resigns ఇన్ఫోసిస్‌లో సంచలనం విశాల్ సిక్కా రాజీనామా ఎఫెక్ట్
రాజీ పద్దతిలో?

రాజీ పద్దతిలో?

బోర్డు సమావేశంతో సంబంధం లేకుండా.. బయట తీసుకున్న నిర్ణయాలనే సమావేశంలో వెల్లడించారని ఎస్‌ఈఎస్‌ ఆరోపించింది. ఒకవిధంగా ఇదంతా రాజీ పద్దతిలో జరిగి ఉంటుందని చెప్పుకొచ్చింది.

బోర్డు రెండవ విడుత సమావేశంలో నీలేకని నియామకంపై ప్రకటన వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తొలి విడుత సమావేశం మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి సమక్షంలోనే జరిగిందని చెబుతున్నాయి. . విశాల్‌ సిక్కా, మరో ఇద్దరు బోర్డు సభ్యలు జెఫ్రీ లెమాన్, జాన్ ఎట్‌చెమెండీ రాజీనామాలు ఆమోదించిన అనంతరం, నిలేకని ఇన్ఫీలో జాయిన్‌ అయ్యారు.

 గవర్నెర్స్ రూల్స్‌కు విరుద్దంగా:

గవర్నెర్స్ రూల్స్‌కు విరుద్దంగా:

నీలేకని రీఎంట్రీ తర్వాత శేషసాయి బోర్డు చైర్మన్‌గా తప్పుకున్నారు. కో-చైర్మన్‌ రవి వెంకటేషన్‌ కూడా రాజీనామా చేశారు. వెంకటేషన్ రాజీనామా చేశారు గానీ బోర్డులో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇవన్నీ రాజీ పద్దతిలోనే జరిగాయని ఎస్‌ఈఎస్‌ ఆరోపిస్తోంది. బయట తీసుకున్న నిర్ణయాలను, బోర్డు మీటింగ్‌లో వెల్లడించడం, కార్పొరేట్‌ గవర్నెర్స్‌ ప్రమాణాలకు విరుద్ధమని తెలిపింది.

నీలేకని రీఎంట్రీ:

నీలేకని రీఎంట్రీ:

విశాల్ సిక్కా రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్ఫోసిస్‌ని గ‌ట్టెక్కించ‌డానికి నందన్ నీలేకని రీఎంట్రీ ఇచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన ఏడుగురు వ్యక్తుల్లో నీలేకని ఒకరు. 2002-2007కాలంలో కంపెనీకి సీఈవోగా వ్యవహరించారు. అనంతరం ఆధార్ కార్డుల రూపకల్పన ప్రాజెక్టు కోసం కంపెనీని వీడారు. సిక్కా రాజీనామాతో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు.

English summary
Advisory firm Stakeholders Empowerment Services (SES) has alleged that Infosys violated corporate governance norms at the time of Nandan Nilekani's appointment,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X