వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ - పాన్‌కార్డు అనుసంధానంతో ఎన్నో ఇబ్బందులు

ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది జూలై 31వ తేదీ లోపు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది జూలై 31వ తేదీ లోపు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ - పాన్ కార్డ్ లింక్ సామాన్యులకు ఇబ్బందులు తెచ్చేలా ఉంది.

ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో తన ఇంటిపేరు ఇబ్బందులు తీసుకు వస్తుందని కే వెంకటేష్ అసలు ఊహించలేదు. ఆయన తన పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయలేదు. దీంతో అతను చెన్నైకి చెందిన అకౌంటెంట్‌ను కలిశారు. అప్పుడు సమస్య ఏమిటో అర్థమయింది.

Initials, punctuations on PAN card make linking with Aadhaar a pain

వెంకటేష్ యొక్క ఇంటిపేరు 'కె'. కే అంటే పూర్తిగా కృష్ణమూర్తి. ఇది అతని తండ్రి పేరు. ఆధార్ కార్డులో ఇలాగే ఉంది. మిస్ మ్యాచ్ కారణంగా వెంకటేష్ పేరును సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు.

ఆధార్ - పాన్ కార్డులు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిల్లో ఉన్న చిన్నపాటి తప్పులను మాన్యువల్‌గా ఏం చేయలేం.

యుగినె డి'సిల్వ కాలేజీ లెక్చరర్. అతనికి చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఎలాంటి సాయం చేయలేకపోయారు. ఎందుకంటే ఆధార్ డాటా బేస్ స్పెషల్ క్యారెక్టర్స్‌ను గుర్తించలేదు. అదే సమయంలో పాన్ కార్డు డేటా బేస్ మాత్రం గుర్తిస్తుంది.డి'సిల్వ పేరులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్‌ను గుర్తించలేకపోవడం వల్ల ఏం చేయలేకపోయారు.

కేఎస్ శ్రీనివాస్. పాన్ కార్డులో ఇతని పేరు ఇంటి పేరు షార్ట్ కర్ట్‌లలో ఉంది. ఆధార్ కార్డులో పూర్తిగా ఉంది. ఇది కూడా ఇబ్బందికరంగా మారింది.

సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చిన్న చిన్న మార్పులను మాన్యువల్‌గా చేసుకునే వెసులుబాటు కల్పించాలని లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు కోరుకుంటున్నారు. ఇలాంటి అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని పంకజ్ ధరంషి అనే సీఏ అన్నారు. చాలామంది ఏళ్ల క్రితమే పాన్ కార్డులు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ కొత్తగా తీసుకోవడం ఇబ్బందికర పరిణామం అన్నారు. చిన్న చిన్న మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించడం ఉత్తమం అని చెబుతున్నారు.

ఆధార్ - పాన్ కార్డ్ లింక్ ఇబ్బందులపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇలాగయితే పలువురు ట్యాక్స్ ప్లేయర్లు డిఫాల్టర్లుగా మారే అవకాశముందని సిటిజెన్స్ ఫోరమ్ ఫర్ సివిక్ లిబెర్టీస్ యాక్టివిస్ట్ గోపాల్ కృష్ణ అన్నారు.

ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్న వారికి మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఓ చిన్న సూచన చేశారు. 'రిటర్న్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా ఫైల్ చేయండి. దానికి సుప్రీం కోర్టు ఆర్డర్స్‌ను అటాచ్ చేయండి. అప్పుడు వారు మీ ఐటీ రిటర్న్స్ తిరస్కరిస్తారు. నిజానికి పాన్ కార్డ్ లేకుండా కూడా ఇన్ కం ట్యాక్స్ ఫైల్ చేయవచ్చునని నిబంధనలు చెబుతున్నాయి' అని చెప్పారు.

English summary
K Venkatesh never thought the initial in his name would put him in a spot over filing his tax returns. When his PAN card could not be linked to his Aadhaar card, the Chennai-based banker consulted his accountant who discovered the problem: Venkatesh's initial 'K' was expanded as Krishnaswamy, his father's name, in the Aadhaar database. The system wouldn't accept the 'mismatch', leaving Venkatesh at his wits' end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X