• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విషాదంలో రెచ్చిన దొంగలు: రైలు డ్రైవర్ సడన్ బ్రేక్‌వేస్తే ఇంకా ఘోరం!, సిద్ధూ భార్య ఆలస్యంగా రావడంతో

|

అమృత్‌సర్: రెండు రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 61 మంది మృతి చెందగా, 143 మంది గాయపడ్డారు. అలాంటి విషాద పరిస్థితుల్లోను నిస్సహాయస్థితిలో ఉన్న వారి నుంచి కొందరు విలువైన వస్తువులను దొంగిలించిన దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయట.

మృతి చెందిన, గాయపడిన వారి బంధువులు చెబుతున్న వివరాల మేరకు.. వారి మెడలలోని బంగారు వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు కనిపించడం లేదు. ఈ ప్రమాదంలో నా కొడుకు చనిపోయాడని, ఇలాంటి సమయంలోను తన కొడుకుకు చెందిన రూ.20వేల మొబైల్ ఫోన్ ఎవరో తీసుకెళ్లారని ఓ బాధితుడు చెప్పారు.

 అంత విషాదంలోను ఫోన్లు, డబ్బులు, చైన్ల దొంగతనం

అంత విషాదంలోను ఫోన్లు, డబ్బులు, చైన్ల దొంగతనం

మరో బాధితుడు మాట్లాడుతూ.. తాను తన కూతురు, కొడుకుతో కలిసి దసరా వేడుకలు చూసేందుకు వెళ్లానని, ఈ ప్రమాదంలో తన కూతురును కోల్పోయానని, తన కొడుకు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడని, ప్రమాదం సమయంలో తన కొడుకు, కూతురుకు సహాయం చేసేందుకు తాను ఓ వైపు అరుస్తున్న సమయంలో మరోవైపు ఎవరో తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిపోయారని వాపోయారు.

మోడీ దిగ్భ్రాంతి: 'ఆర్గనైజర్ కాంగ్రెస్, జనాలపై నుంచి రైలు వెళ్తుంటే సిద్ధూ భార్య ప్రసంగం', ఆమె ఖండన

 రైలు ప్రమాదం.. తప్పు ఎవరిది?

రైలు ప్రమాదం.. తప్పు ఎవరిది?

పంజాబ్ రైలు ప్రమాదంపై తప్పు ఎవరిదనే ప్రశ్న ఉదయిస్తోంది. ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా దసరా వేడుకలు నిర్వహించడం, ఆ సమయంలో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య హాజరై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడం, సిద్ధూ భార్యను ఓ స్థానిక కాంగ్రెస్ నేత ఉద్దేశించి మాట్లాడుతూ.. 500 రైళ్లు వచ్చినప్పటికీ మీ కోసం (సిద్ధూ భార్య కోసం) ఇక్కడికి వచ్చిన వాళ్లు మాత్రం కదలరని చెప్పడం, మరోవైపు, ఈ ప్రమాదంలో స్థానికుల తప్పితమే ఎక్కువగా ఉందని సిద్ధూ భార్య చెప్పడం.. ఇలా పలు అంశాలపై చర్చ సాగుతోంది. ట్రాక్ సమీపంలో రావణ దహన వేడుకలు నిర్వహించేందుకు పురపాలక, రైల్వే అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కనీసం నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు.

 ఎన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ

ఎన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ

శనివారం ఘటనా స్థలం జోడా ఫటక్‌తో పాటు ఆసుపత్రులను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది ఉత్తర్ ప్రదేశ్‌, బీహార్‌ల నుంచి వచ్చిన వలస కూలీలే. కనీసం గత 20 ఏళ్లుగా ఇదే చోట ఏటా రావణ దహన కార్యక్రమం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదయింది. ఎన్నేళ్లుగా ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ అనుమతి తీసుకోకపోవడం, ముందు జాగ్రత్తలు లేకపోవడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.

ఈ వేడుకలకు అనుమతి లేదు, పర్మిషన్ లేదు

ఈ వేడుకలకు అనుమతి లేదు, పర్మిషన్ లేదు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రావణ దహనం నిర్వహించడానికి తామెవరికీ అనుమతి ఇవ్వలేదనీ, ఎవరూ అనుమతినీ కోరలేదని అమృత్‌సర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ సోనాలీ గిరి చెప్పారు. దసరా వేడుకల నిర్వహణకు తాము నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇచ్చినా నిర్వాహకులు స్థానిక సంస్థ నుంచి, కాలుష్య నియంత్రణ విభాగం నుంచి అనుమతి పొందలేదని అమృత్‌సర్‌ పోలీసులు తెలిపారు. ఆ రెండు శాఖల నుంచి అనుమతి పొందాల్సిందిగా తాము చెప్పామని డీసీపీ అమ్రిక్‌సింగ్‌ తెలిపారు.

అప్పటికీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు

అప్పటికీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు

ప్రమాదస్థలాన్ని శుక్రవారం అర్ధరాత్రి రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ సందర్శించారు. అనంతరో మాట్లాడారు. రావణ దహనం గురించి తమకు ఎవరూ చెప్పలేదన్నారు. స్టేషన్ల వద్ద కాకుండా మార్గమధ్యలో రైళ్లన్నీ వాటికి నిర్దేశించిన వేగంతో వెళ్తాయని, అలాంటి చోట్ల పట్టాల మీద ప్రజలు ఉంటారని ఊహించలేమని, మార్గమధ్యలో రైల్వే సిబ్బంది కూడా ఉండరని చెప్పారు. రైలు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఉంటే మరింత ఘోరం జరిగి ఉండేదన్నారు. ఇది రైలు ప్రమాదం కాదని, ఘటనపై రైల్వే భద్రత కమిషనర్ విచారణ ఉండదన్నారు. ఇది ఒక దుర్ఘటన అన్నారు. ప్రమాదం వెనుక రైల్వే శాఖ తప్పిదం లేదని, డ్రైవర్ పైన చర్యలు ఉండవని సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. జాగ్రత్తలతో వేడుకలు నిర్వహిస్తే ప్రమాదం జరగకపోయి ఉండేదన్నారు. ప్రమాద స్థలం వద్ద మలుపు కూడా ఉందని, జనాలు కూడా సరిగా కనిపించరని తెలిపారు. పైగా ప్రజలను గుర్తించగానే, గంటకు 91 కిలో మీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలును డ్రైవర్ 68 కిలో మీటర్ల వేగానికి తగ్గించారని చెప్పారు. మలుపు కారణంగా ప్రజలను ముందే గుర్తించడానికి సాధ్యం కాలేదన్నారు. అనుమతి తీసుకోకపోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుక కావడంతో అన్ని వేళ్లు ఆ పార్టీ వైపు వెళ్తున్నాయి.

 సిద్ధూ భార్య ఆలస్యంగా రావడం కూడా కారణం

సిద్ధూ భార్య ఆలస్యంగా రావడం కూడా కారణం

రావణ దహనం సాధారణంగా సాయంత్రం ఆరు గంటల 15 నిమిషాల ప్రాంతంలోనే దహనం చేస్తారు. అయితే, శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి అయిన నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ ( సిద్ధూ భార్య) ఆలస్యంగా వచ్చినట్లు చెబుతున్నారు. ఆమె ఉపన్యాసం పూర్తయి దహనం మొదలయ్యేసరికి రాత్రి ఏడు అయింది. డీఎంయు రైలును ఏడు గంటలకే షెడ్యూల్‌ చేసి ఉండటం, సరిగ్గా అదే సమయంలో దహనం మొదలవడం ఈ ఘోరకలికి కారణమైందని చెబుతున్నారు. పాలన యంత్రాంగం, కమిటీ తప్పిదమే ఈ దారుణానికి కారణమంటున్నారు. రైలు వస్తున్నదనే విషయాన్ని ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసి ఉండవచ్చన్నారు. లేదంటే ముందుగానే హెచ్చరించి సదరు స్థలం వద్దకు రాగానే కాస్త నిలిపివేసేలా చర్యలు చేపట్టాల్సిందన్నారు. ఇక్కడ స్థలం ఇరుకుగా ఉంటుందని, అందుకే గత ఏడాది ఇక్కడ వేడుకలే నిర్వహించలేదని మరికొందరు చెబుతున్నారు.

English summary
Call it heartless or sadistic, but what left many hopeless in humanity was when they realised that some rogues in the crowd had made away with the valuables of the helpless survivors and victims of the horrific Amritsar train tragedy that killed 61 and injured 143 on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X