వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లి పరార్: నిరసన, ఆసుపత్రిలో రోగి, ప్రజా ప్రభుత్వంపై దాడి!

|
Google Oneindia TeluguNews

పాట్నా: డెంగ్యూ వ్యాదితో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రి మీద ఇంక్ (సిరా) చల్లి నిరసన వ్యక్తం చేసిన ఘటన బీహార్ లోని పాట్నా మెడికల్ కాలేజ్ ఆవరణంలో జరిగింది. కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కోటు, ఆయన కారు మీద గుర్తు తెలియని వ్యక్తి ఇంక్ పోసి నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనాడు.

మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ!మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ!

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మంగళవారం పాట్నాలోని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి చేరుకున్నారు. ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాదితో భాదపడుతున్న వారిని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Ink thrown by unknown person on union minister Ashwini Kumar Choubey in Patna

అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ గుర్తె తెలియని వ్యక్తి ఒక్కసారిగా ఆయన మీద ఇంక్ తో దాడి చేశాడు. గురి తప్పడంతో ఇంక్ కేంద్ర మంత్రి ముఖం మీద కాకుండా ఆయన కోట్ మీద, పక్కనే ఉన్న కారు మీద పడింది.

ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !

ఇంక్ తో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనాడు. ఇంక్ దాడి అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతూ మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి ప్రజా ప్రభుత్వం నాలుగో స్థంభం మీద దాడి చేసినట్లు ఉందని ఆరోపించారు.

బీహార్ లో వరదల కారణంగా కొంత కాలం నుంచి విపరీతంగా డెంగ్యూ వ్యాదితో చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీహార్ లో వరదలు వచ్చిన తరువాత ఇప్పటి వరకూ సుమారు 900 మందికి పైగా డెంగ్యూ వ్యాదితో చికిత్స పొందుతున్నారని వైద్యులు అంటున్నారు.

English summary
Ink thrown by unknown person on union minister Ashwini Kumar Choubey in Patna on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X