• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

థాక్రేకి పవార్‌కి చెడిందా...? కంగనా ఇష్యూతో చిచ్చు మొదలైందా...? ఆ మీటింగ్‌లో అసలేం చర్చించారు...

|

సుశాంత్ సింగ్ మరణంపై చర్చ పక్కకుపోయింది. ఇప్పుడు చర్చంతా కంగనా రనౌత్ చుట్టే. ముంబైలోని ఆమె కార్యాలయాన్ని కూల్చివేసి శివసేన ఒకరకంగా ట్రాప్‌లో ఇరుక్కుపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే రాజకీయ చతురతతో కాకుండా... కేవలం ఆవేశపూరిత నిర్ణయం తీసుకోవడం వల్లే మహా సర్కార్‌‌కు ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి రాజకీయ కురువృద్దుడు,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కంగనా విషయంలో తొందరపడవద్దని ఉద్దవ్ థాక్రేని వారించినప్పటికీ... ఆయన మాట నెగ్గలేదు. దీంతో థాక్రేపై పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... కంగనా కారణంగా సంకీర్ణ సర్కార్‌లోని ఇద్దరు పార్టీ అధినేతల మధ్య చిచ్చు మొదలైందన్న కథనాలు వస్తున్నాయి. అసలు థాక్రే-పవార్ మధ్య ఏం చర్చ జరిగింది...?

థాక్రే-పవార్... మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు...

థాక్రే-పవార్... మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు...

ముంబైని పీఓకె(పాక్ ఆక్రమిత కశ్మీర్)తో పోల్చి మహా సర్కార్ ఆగ్రహానికి గురైన కంగనా రనౌత్... బుధవారం(సెప్టెంబర్ 9) ముంబైకి వస్తున్నానని సవాల్ విసిరి శివసేనను మరింత కవ్వించింది. కంగనా దూకుడుకు ఎలాగైనా బ్రేక్ వేయాలన్న ఆలోచనతో ముంబైలోని ఆమె కార్యాలయాన్ని మహా సర్కార్ టార్గెట్ చేసింది. బృహన్ ముంబై కార్పోరేషన్ అక్కడ కూల్చివేతలు మొదలుపెట్టిన సమయంలోనే.... ముఖ్యమంత్రి థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,శివసేన నేత సంజయ్ రౌత్‌లతో ఓ కీలక సమావేశం నిర్వహించారు. కంగనా దూకుడును ఎదుర్కోవడానికి మనమూ దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని సమావేశంలో పవార్ థాక్రేకి సూచించారు. అసలు కంగనాను పట్టించుకోకపోవడం ఉత్తమం అని... అనవసరంగా విషయాన్ని పెద్ద చేసుకోవద్దని చెప్పారు.

లేని వ్యతిరేకత తెచ్చుకోవద్దన్న పవార్....

లేని వ్యతిరేకత తెచ్చుకోవద్దన్న పవార్....


అంతేకాదు,కంగనా రనౌత్ ఇప్పుడు కేవలం సినీ సెలబ్రిటీ కాదని... ఆమె వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని పవార్ థాక్రేతో చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కంగనాకు వై కేటగిరీ భద్రతా కల్పించారంటే... వాళ్ల అసలు ఉద్దేశమేంటో అక్కడే స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ముంబైని పీఓకెతో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యల విషయంలో ముంబై ప్రజలు కచ్చితంగా ప్రభుత్వం వైపే నిలుస్తారని చెప్పారు. కాబట్టి ప్రజలు మనకు అనుకూలంగా ఉన్న తరుణంలో తొందరపాటు నిర్ణయాలతో లేని వ్యతిరేకత తెచ్చుకోవద్దని సూచించారు.

పవార్ మాట వినని థాక్రే....

పవార్ మాట వినని థాక్రే....

అయితే ఉద్దవ్ థాక్రే మాత్రం పవార్‌తో విబేధించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఒక పద్దతి ప్రకారం టార్గెట్ చేస్తోందని అన్నారు. కంగనా లాంటి వాళ్లను పావులుగా ఉపయోగించి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సుశాంత్ కేసులోనే కాదు,కోవిడ్ 19,పాల్ఘర్‌లో సాధువుల హత్యలు,తదితర అంశాల్లో మహా సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు మహారాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని... కాబట్టి ప్రతి దాడి వ్యూహం తప్పదని పేర్కొన్నారు.

పవార్‌కు,థాక్రేకి చెడినట్లేనా...?

పవార్‌కు,థాక్రేకి చెడినట్లేనా...?

థాక్రే తన సూచనలను పట్టించుకోకపోవడం పవార్‌ను ఒకింత అసహనానికి గురిచేసింది. కంగనాకు లేని పబ్లిసిటీని తెచ్చిపెట్టారని.. ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు,ముంబైలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయని... పరోక్షంగా బీఎంసీ చర్యను తప్పు పట్టారు. పవార్ ఇలా బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడంతో థాక్రేతో ఇక ఇయనకు చెడినట్లే అన్న కథనాలు వస్తున్నాయి. కూల్చివేతపై అటు కోర్టు స్టే ఇవ్వడం,ఇటు పవార్ అసంతృప్తి వెళ్లగక్కడం థాక్రేకి మింగుడుపడని విషయాలే. మొత్తం మీద తన దూకుడుతో థాక్రే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే కనిపిస్తోంది.

English summary
The controversy that erupted after the demolition of actor Kangana Ranaut’s office bungalow by the Brihanmumbai Municipal Corporation (BMC) appears to have created problems for the Maha Vikas Aghadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X