వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకులకు వసూలు కాని రుణం విషయంలో ఇది ఉపయోగపడే అవకాశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాడ్ డెబిట్, నాన్ ఫర్‌ఫార్మింగ్ అసెంట్స్ (ఎన్‌పీఏ)లు భారతీయ బ్యాంకింగ్ రంగానికి, అలాగే భారతీయ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ఆందోళన కలిగించే విషయాలు. కానీ విదేశాల్లోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకుంటే భారతీయ బ్యాంకులు, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్య పూర్తి భిన్నంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతదేశంలోని బ్యాంకులు మన దారిలోనే డీల్ చేయాలన్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గిరిష్ చంద్ర చతుర్వేది మాట్లాడుతూ.. భారతీయ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్న వారు సహజంగా భారతీయులేనని చెప్పారు. అంతేకాకుండా తీసుకున్న రుణానికి, రికవరీకి ఏమాత్రం పొంతన కుదరడం లేదన్నారు. విదేశాలలో రుణాల చెల్లింపు సమస్యల పరిష్కారానికి కేవలం కొన్ని నెలల సమయమే పడుతుందని, కానీ మనదేశంలో మాత్రం ఐదు నుంచి ఏడేళ్ల సమయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు.

చతుర్వేదీ ఇంకా మాట్లాడుతూ... ఎన్‌పీఏల విషయంలో సమకాలీన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. కానీ ఫెడరల్ స్ట్రక్చర్ కారణంగా ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉంటే, మరికొన్ని రాష్ట్రం పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తప్పు ఎవరిదైనా అంతిమంగా బ్యాంకులు సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. అయినప్పటికీ చివరి వ్యక్తి లబ్ధి పొందేవరకు ఇది కొనసాగుతుందని తెలిపారు.

Insolvency and Bankruptcy Code may help to deal with bad debt and NPA

అతను ఇంకా మాట్లాడుతూ... భారతదేశంలో డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఫెయిల్ అయిందని చెప్పారు. కొంతమంది పెద్ద మొత్తంలో ఎన్‌పీఏ, బ్యాడ్ డెబిట్‌లు కలిగి ఉన్నారని, వారు ఇప్పటికైనా తిరిగి ప్రారంభించవచ్చునని చెప్పారు.

యూకో బ్యాంక్ ఎండీ రవి కృష్ణ ఠక్కర్ మాట్లాడుతూ.. మనం సమస్యల పరిష్కారం కోసం ఉంటే ఎన్‌పీఏ, బ్యాంక్ డెబిట్‌ల విషయంలో కీలక పరిష్కారం అవసరమని చెప్పారు. ప్రారంభంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో చిన్న, మధ్య తరహా రుణాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ఆనందించదగ్గ విషయం ఏమంటే సమస్యను మనం గుర్తించామని, కాని అందుకు పరిష్కారం బ్యాంకుల చేతుల్లో లేదని చెప్పారు.

భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు పట్నాయక్ మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం సంస్కరణలు తీసుకు వచ్చామని, కానీ వాటి వల్ల ఆశించిన ఫలితాలు లేవని అభిప్రాయపడ్డారు. రుణాల అంశం తీవ్ర సమస్యగా మారిందన్నారు. దివాలా చట్టం (ఐబీసీ) కారణంగా గతంలో ఎలాంటి ఫలితాలు లేకుండా పోయాయని, కానీ ఇప్పుడు కఠినమైన చర్యలు చేపట్టారన్నారు. ఐబీసీని మనం కొట్టిపారేయలేమని, దాని నిర్ణయాన్ని గుర్తించి, ఇది సరిగ్గా పని చేస్తుందని నిర్ధారించుకోవాలన్నారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ... టెలికాం రంగం సరళీకృతం అయిందని, కానీ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం ఇప్పటికి పరిమితులకు లోబడి ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేశామని, కానీ అందుకు కీలకమైన ఆర్థిక రంగానికి తలుపులు మూసేశారమని చెప్పారు. తన అభిప్రాయం మేరకు ఇది ఎంతో కీలకమైన అంశమని చెప్పారు. రుణాలు, నియామకాలు, బదలీలలో రాజకీయ జోక్యం అనేది ప్రపంచంలో ఏ దేశంలోనైనా అరుదుగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ విషయంలో మనం దృష్టి సారించాలన్నారు.

బెయిన్స్ అండ్ కంపెనీ భాగస్వామి హర్షవర్ధన్ మాట్లాడుతూ... బ్యాడ్ లోన్ సమస్యను ఐబీఎం పాక్షికంగా పరిష్కరించవచ్చునని, కానీ దీని వల్ల పూర్తిగా సమస్య తీరదని చెప్పారు. ఈ సంస్థలలోని అన్ని స్టేక్‌హోల్డర్స్‌ను సంస్కరించాల్సి ఉందని చెప్పారు.

English summary
Bad debt and non-performing assets (NPA) are major concern for the Indian banking sector and Indian economy in the bargain but experts on the issue feel that the problem faced by Indian banks and financial institutions are entirely different from the issues faced by banks abroad. So the banks in India will have to deal with it in Indian way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X