వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కరే ఉగ్రదాడి భయం ? 22 ఎయిర్ పోర్టులలో రెడ్ అలర్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత పాక్ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దేశ సరిహద్దుల్లో విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఐబి అధికారులు చెప్పారు.

ఈ నేపధ్యంలో భారత్ సరిహద్దులోని 22 విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల్లోని విమాశ్రయాల దగ్గర రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Intelligence agencies have warned 22 airports in the four states

ఈ విషయంలో ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ వర్గాలు లేఖలు రాశారు. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించండతో నాలుగు రాష్ట్రాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.

విమానాశ్రయాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారత్ మీద లష్కరే-ఏ-తోయిబా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దసరా పండుగ సందర్బంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

English summary
Indian Intelligence agencies have warned of a possible terror attack at airports in four states as well as Delhi. 22 airports in the four states have been sent detailed warnings and authorities have confirmed high security measures are being implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X