వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 23.. కౌంటింగ్ డే టార్గెట్.. భారీ ఉగ్రదాడికి స్కెచ్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఆరు దశల పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏడవ విడత మాత్రమే మిగిలింది. ఇక మే 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. కేంద్రంలో అధికారంలోకి ఎవరు రానున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు భారీ ఉగ్రదాడికి స్కెచ్ వేసినట్లు బయటపడటం భయాందోళన రేకెత్తిస్తోంది.

మే 23వ తేదీ టార్గెట్‌గా అదను చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని టెర్రరిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. గురువారం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. అందులో ఒకడి జేబులో నుంచి ఉగ్రదాడికి సంబంధించిన మ్యాప్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి.

 Intelligence agencies warn of possible terror attack on may 23 counting day

కొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలుకొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు

అవంతిపురా, శ్రీనగర్ ఎయిర్‌ బేస్‌ క్యాంపులపై దాడి జరిపేలా ఆ స్కెచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఈ దాడులకు ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఈ రెండు క్యాంపులే టార్గెట్‌గా కౌంటింగ్ రోజు బీభత్సం సృష్టించాలనేది వారి ప్లాన్‌గా అర్థమవుతోంది.

మే 23 కౌంటింగ్ రోజుకు సరిగ్గా రంజాన్ మాసంలో 17వ రోజు రానుంది. ఆ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని కలకలం సృష్టించాలనేది వారి స్కెచ్ గా అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. దీనికోసం ఈనెల 14వ తేదీన పుల్వామా ప్రాంతంలో ఉగ్ర కమాండర్ల భేటీలో ఈ దాడులకు సంబంధించిన ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

English summary
Intelligence agencies have sounded an alert on a possible terror attack in the Kashmir Valley on May 23 when the counting of votes for the Lok Sabha polls will take place. According to the agencies, terrorists are planning to carry out attacks on Srinagar and Awantipora air bases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X