వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఘావర్గాల హెచ్చరిక: చెన్నై లక్ష్యంగా లష్కరే ఉగ్రవాదులు దాడులు చేసే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

తమిళనాడు: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్... భారత్‌పై ఉగ్రదాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తోందా..? పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి విధ్వంసం చేసేందుకు కుట్రపన్నుతున్నారా..? ఇప్పటికే వారి ఆపరేటివ్స్‌ను ఉగ్రవాద సంస్థలు భారత్‌కు పంపాయా అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా లష్కరే తొయిబా ఉగ్రవాదులు దక్షిణ భారత దేశంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక తమిళనాడులోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఎక్కువమంది పాకిస్తానీయులు కాగా.. ఒకరిద్దరు శ్రీలంకకు చెందిన వారు కూడా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వివరించాయి. ఇక ఈ గ్రూపులోని సభ్యులకు తమిళనాడులోని పలు ప్రాంతాలను టార్గెట్ ఇచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తక్కువ భద్రత ఉండటంవల్లే తమిళనాడును ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కోయంబత్తూర్, చెన్నై నగరాలు టార్గెట్‌లో ఉన్నాయని, ఇప్పటికే తాము అలర్ట్‌గా ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. కొంతమంది అనుమానితుల మూవ్‌మెంట్స్‌ను కూడా గమనిస్తున్నట్లు చెన్నై కమిషనర్ చెప్పారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సెక్యూరిటీని మరింత పెంచినట్లు చెప్పారు.

Intelligence alert: Terrorists enter South India from Srilanka,Chennai in target

ఇక ఆరుగురు సభ్యుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన ఇల్యాస్ అన్వర్ కాగా మిగతావారు శ్రీలంకకు చెందిన తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. అంతేకాదు వీరంతా హిందువుల ముసుగులో తిరుగుతున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌ ఎన్ని విధాలుగా చెడ్డ చేయాలో అన్ని విధాలుగా పాక్ ప్రయత్నాలు చేపట్టింది. చైనా అండ చూసుకుని పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఇక ఒకానొక సమయంలో యుద్ధం ద్వారానే భారత్‌కు సమాధానం చెబుతామన్న వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ చేసింది.

English summary
Intelligence reports have warned about a group of Lashkar-e-Taiba terrorists entering South India via Sri Lanka. While most of the terrorists are Pakistanis some of them are from Sri Lanka as well.As per the intelligence report, the group has about 6 to 8 people and their objective is to hit targets in Tamil Nadu and other areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X