వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిక జరిమానాలు విధిస్తేనే... ప్రజలు భయపడతారు : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

|
Google Oneindia TeluguNews

ఇటివల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే... వేల రూపాయల జరిమానాలు వేయడంతో పలువాహానదారుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అయితే కేంద్రం పెద్ద ఎత్తున జరిమానాలు విధించడాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమర్ధించుకున్నారు. ఆ మాత్రం జరిమానాలు లేకపోతే ప్రజలు బయపడే పరిస్థితి లేదని చెప్పారు.

చట్టమంటే ఏ మాత్రం లెక్కచేయని ప్రజలకు కేంద్రం ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం లోని జరిమానాలతో ప్రజలు దారికి వస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలు విషయంలో ప్రజలు అశ్రద్దగా వ్వవహరించారని, చట్టాలపై గౌరవం గాని,భయం గాని లేకుండా ఉన్నారని ఆయన చెప్పారు. ఇక పరిస్థితి పోవాలంటే కఠిన నిబంధనలు అవసరం అని అన్నారు. మరోవైపు అందరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే.. విదేశీ రహదారుల వలే భారత దేశ రహాదారులు కూడ మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటీ సంధర్భంలోనే ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు.

Intelligent traffic system does not discriminate :Union Minister Nitin Gadkari

ఇక కొత్త చట్టం ముందు అందరు సమానమేనని చెప్పిన ఆయన ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడ జరిమానాలు కడుతున్నారని చెప్పారు.ఈనేపథ్యంలోనే అధిక మొత్తంలో ఒకసారి జరిమానాలు కట్టిన వారు మరోసారి ట్రాఫిక్‌ను ఉల్లంఘించకుండా ఉంటారని చెప్పారు.

English summary
Intelligent traffic system does not discriminate between violators of law whether it is a central minister, chief minister, bureaucrat or a journalist, Union Minister Nitin Gadkari said on Sunday while asserting hefty fines for traffic rule violations are aimed at curbing road accidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X