వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ కెనడా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 35మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

హవాయి : ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. వాంకోవర్ నుంచి సిడ్నీకి వెళ్తున్న ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అమెరికాలోని హోనోలూలు ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎయిర్ కెనడా విమానం 33 వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన 2గంటలకు హవాయి ప్రాంతం గూండా ప్రయాణిస్తుండగా ఆకస్మాత్తుగా కుదుపులకు లోనైంది.

భారీ కుదుపుల కారణంగా ప్రయాణీకుల తలలు సీలింగ్‌కు తాకాయి. దీంతో 35మంది ప్యాసింజర్లకు స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో ప్రయాణీకులు భయంతో కేకలు వేశారు. దీంతో ఒక్కసారికి అలజడి మొదలైంది. కుదుపుల కారణంగా పైలెట్ విమానాన్ని హోనోలూలులోని డేనియల్ కె ఇనోయీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Intense turbulence struck an Air Canada flight, 35 injured

ఘటన జరిగిన సమయంలో విమానంలో 269మంది ప్రయాణీకులతో పాటు 13మంది ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ కుదుపులకు లోనైన సమయంలో అది 36వేల అడుగుల ఎత్తులో ఉంది. హోనోలూలు ఎయిర్‌పోర్టులో ల్యాండైన అనంతరం గాయపడిన ప్రయాణీకులకు చికిత్స అందించారు. అధికారులు ప్రయాణ సమయంలో విమానం కుదుపులకు లోనవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

English summary
Intense turbulence struck an Air Canada flight to Australia on Thursday and sent unbuckled passengers flying into the ceiling, forcing the plane to land in Hawaii.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X