వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఖైదీలు నలభీములు.. వారి వంటలు తినాలంటే మాత్రం స్విగ్గీలో ఆర్డర్ చెయ్యాల్సిందే..!!

|
Google Oneindia TeluguNews

కేరళ:దక్షిణ భారతదేశంలో మంచి పర్యాటక రాష్ట్రంగా పేరుగాంచింది కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం పర్యాటకంగానే పాపులర్ కాలేదు.. మంచి ఆహారంకు కూడా ఈ రాష్ట్రం ఫేమస్ అయ్యింది. రకరకాల వంటకాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సంప్రదాయ వంటకం అయిన తపియోకా ఫిష్ కర్రీ, ఇడియప్పం, తలసెరీ చికెన్ బిర్యానీ , ఇష్టు అప్పం కాంబినేషన్ లాంటి వంటకాలకు కేరళ ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ వంటకాలను రుచి చూడకుండా రాష్ట్రం దాటరు. అయితే కేరళలోని ఓ సెంట్రల్ జైలులో ఖైదీలు వండిన వంటకాలకు భలే డిమాండ్ ఏర్పడింది. ఇక తమ వంటకాలను అందరికీ రుచి చూపించాలని భావించిన జైలు అధికారులు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీతో జతకట్టారు. ఇంతకీ ఆ జైలు ఎక్కడుంది.. ఆ కథేంటి..?

స్విగ్గీతో జతకట్టిన వియ్యూరు సెంట్రల్ జైలు

స్విగ్గీతో జతకట్టిన వియ్యూరు సెంట్రల్ జైలు

కేరళలోని త్రిసూర్ జిల్లాలోని వియ్యూర్ సెంట్రల్ జైలు ప్రయోగాత్మకంగా తమ జైలులో వండిన వంటకాలను బయట డెలివరీ చేస్తోంది. ఇప్పటి వరకు జైలులోనే కౌంటర్ పెట్టి అమ్మేదీ. అయితే కొంతమంది జైలులోకి అడుగుపెట్టాలంటే కాస్త మొహమాటం పడుతుండటంతో జైలు మేనేజ్‌మెంట్ తమ వంటకాలను డెలివరీ చేసేందుకు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీతో జతకట్టింది. ఎక్కువ ఆర్డర్లు వస్తుండటంతో డెలివరీ కష్టం అయిపోయింది. చికెన్ బిర్యానీ కాంబోగా ఉండే మెనూలో ఒక అరిటాకు, తాగునీరు బాటిల్‌కూడా సరఫరా చేస్తోంది.

ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ పేరుతో క్యాంటీన్

ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ పేరుతో క్యాంటీన్

గత కొన్నేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నఖైదీలు అందులో ఓ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. దీనిపేరు ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ. ఇప్పటి వరకు క్యాంటీన్‌కే పరిమితమైన చికెన్ బిర్యానీ ఇకనుంచి బయట డెలివరీకూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఈ క్యాంటీన్‌ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు. జైలులోని ఆహారం చేయడం నుంచి ప్యాకింగ్ చేసేవరకు ఖైదీలే చేస్తారు. ఇక పర్యావరణంను ప్రమోట్ చేసేందుకు పార్శిల్ కూడా పేపర్ బ్యాగ్స్‌లోనే పంపడం జరుగుతోంది.

చికెన్ కాంబో ప్యాక్‌తో వచ్చేవి ఇవే..!

చికెన్ కాంబో ప్యాక్‌తో వచ్చేవి ఇవే..!

ఇక చికెన్ బిర్యానీ కాంబోలో 300 గ్రాముల బిర్యానీ రైస్, ఒక ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్, చికెన్ కర్రీ, నాలుగు చపాతీలు, ఊరగాయ, సలాడ్, ఒక వాటర్ బాటిల్ వస్తాయి. ఇవన్నీ కేవలం రూ.127 మాత్రమే అని జైలు అధికారులు తెలిపారు.అయితే వాటర్ బాటిల్ వద్దనుకునే కస్టమర్లకు ఈ కాంబో ప్యాక్ రూ.117 అవుతుందని చెప్పారు. తొలిరోజులు కాబట్టి త్రిసూర్ నగరంలోని 6 కిలోమీటర్ల పరిధి వరకే ఈ పార్శిల్‌లు డెలివరీ చేయడం జరుగుతుంది. గురువారం ఈ ప్రాజెక్టును జైలు సూపరింటెండెంట్ నిర్మలందన్ నాయర్ ఇతర అధికారులు ప్రారంభించారు. స్విగ్గీలో మెనూ పెట్టగానే కేవలం 20 నిమిషాల్లోనే పార్శిల్‌ సేవలను మూసివేయాల్సి వచ్చింది. అంతలా ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు.

 జైలులో తయారైన ఆహారంను మొబైల్ సేవల ద్వారా విక్రయం

జైలులో తయారైన ఆహారంను మొబైల్ సేవల ద్వారా విక్రయం

ఇదిలా ఉంటే కేరళ జైళ్లు గత కొన్నేళ్లుగా ఫుడ్ బిజినెస్‌లో ఉన్నాయి.ఫుడ్ ఫర్ ఫ్రీడం పేరుతో తిరువనంతపురం సెంట్రల్ జైలు దగ్గర రెస్టారెంట్ ప్రారంభించారు. దీనికి భారీ స్పందన వచ్చింది. మరోవైపు ఇక్కడ ప్రిపేర్ చేసిన చపాతీ, వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీలను మొబైల్ సర్వీసుల ద్వారా కూడా అందజేస్తున్నారు. ఇక వియ్యూరు సెంట్రల్ జైలులో ఇదొక్కటే ప్రత్యేకతగా నిలవలేదు. ఈ జైలులో సేంద్రీయ వ్యవసాయం చేస్తారు. ఇందులో క్రీడలు ఆడేవారు కూడా ఉన్నారు. ఓ వాలీబాల్ టీమ్ కూడా ఉంది. ఇక మ్యూజిక్ బ్యాండ్ కూడా ఈ జైలు స్పెషాలిటీగా నిలుస్తోంది.

English summary
In a first of its kind initiative, Central Prison, Viyyur in Thrissur district of Kerala is offering a chicken biryani combo, served in a banana leaf with a bottle of drinking water.If you are a little hesitant or embarrassed to step into a jail compound, don't worry, you can just get it home-delivered. Viyyur jail authorities have tied up with food delivery app Swiggy to deliver food at customers' doorsteps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X