వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపట్నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం: ఫ్రాన్స్, యూఎస్, జర్మనీలకు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అంతర్జాయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

 తెలంగాణలో 40వేల చేరువలో కరోనా పాజిటివ్ కేసులు: 11 మరణాలు తెలంగాణలో 40వేల చేరువలో కరోనా పాజిటివ్ కేసులు: 11 మరణాలు

ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో చర్చలు జరిపామని కేంద్రమంత్రి తెలిపారు. శుక్రవారం అమెరికా నుంచి శనివారం ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.

International Flights Resume Between India, US and France


జులై 17 నుంచి జులై 31 వరకు భారత్-అమెరికా దేశాల మధ్య 18 యునైటెడ్
ఎయిర్‌లైన్స్ విమానాలు నడుస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు ప్యారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య ఎయిర్‌ఫ్రాన్స్ 28 విమానాలను నడపనుందని వెల్లడించారు. జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని తెలిపారు.

అంతేగాక, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కొలిక్కివచ్చిందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. విదేశీ విమాన సర్వీసులపై ఈ నిర్ణయంలో పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.


Recommended Video

Chabahar Port : No Deal With India On Chabahar Railway Project - Iran || Oneindia Telugu

వివిధ దేశాలకు ఒప్పందాలకు అనుగుణంగా విదేశీ విమాన సేవలను పునరుద్దిస్తున్నామని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా కారణంగా సుమారు మూడు నెలలపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇతర దేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు మాత్రం ఇప్పటి వరకు వందే భారత్ మిషన్ ద్వారా విమాన సర్వీసులను నడిపింది.

English summary
Union Civil Aviation Minister Hardeep Singh Puri on Thursday addressed the resumption of international flights in the country saying that bilateral air bubbles was the only way to go forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X