• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

International Nurses Day 2021: కరోనా వేళ తల్లిని మించిన సేవలు.. సిస్టర్లకు సలాం..!

|

మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో నర్సులు చేస్తున్న సేవలను వర్ణించడం ఎవరి తరం కాదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వృత్తి నిర్వహణలో నిమగ్నమై సేవలందిస్తున్నారు. సేవే పరమావధిగా భావిస్తూ కరోనా పేషెంట్లకు వారు చేస్తున్న సేవలు అద్భుతం. నర్సు వృత్తి చేపట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి.

అలాంటిది ఈరోజున కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ నర్సులు ముందుండి తమ సేవలను అందిస్తూ చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎలా వచ్చింది..? దీని చరిత్ర ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేడు ఫ్లారిన్స్ నైటింగేల్ జయంతి

నేడు ఫ్లారిన్స్ నైటింగేల్ జయంతి

మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ రోజున ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మించారు. ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక ఇంగ్లీష్ నర్సు, అంతేకాదు సామాజిక సంస్కర్త కూడా. చరిత్ర తిరిగేస్తే క్రిమియన్ యుద్ధం జరిగిన సందర్భంలో నర్సుగా ఆమె చేసిన సేవలను నేటికీ గుర్తుండిపోతాయి. ఆధునిక నర్సింగ్‌కు ఫ్లారెన్స్ నైటింగేల్ పునాది వేశారు. నర్సింగ్‌ అంటే ఏంటో ఎలా ఉండాలో దానికంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మహిళ ఫ్లారెన్స్ నైటింగేల్. అంతేకాదు నాటి విక్టోరియా సంస్కృతికి ఒక ఐకాన్‌గా నిలిచారు.

చరిత్ర ఏంటి..?

చరిత్ర ఏంటి..?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 1965వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ నర్సుల సమాఖ్య జరుపుతూ వస్తోంది. అంతకు 12 ఏళ్ల ముందు అమెరికా ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన డొరొతీ సదర్‌లాండ్ నర్సలు దినోత్సవం నిర్వహించాలనే ప్రతిపాదన అప్పటి అమెరికా అధ్యక్షుడి ముందు ఉంచగా ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత 20 ఏళ్లకు 1974 మే 12వ తేదీన ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి అంతర్జాతీయ నర్సుల సమాఖ్య ఏటా ఈరోజున ఇంటర్నేషనల్ నర్సెస్ కిట్లను సరఫరా చేస్తూ వస్తోంది.

కరోనా వేళ.. ఈ సారి అధిక ప్రాధాన్యత

ఈ సారి అంతర్జాతీయ నర్సుల దినోత్సవంకు మునుపెన్నడూ లేనంతగా అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఇందుకు కారణం ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా నుంచి మనుషుల ప్రాణాలను కాపాడటంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్పిటల్స్‌కు ఆరోగ్య వ్యవస్థకు నర్సులు వెన్నెముకలా ఉన్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడంలో నర్సులు చేస్తున్న సేవలను ఈ రోజున తప్పక కొనియాడాల్సిందే. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు... రోజు వారిని గుర్తుకు చేసుకోవాల్సిందే. ఎందుకంటే వృత్తి నిర్వహణలో భాగంగా తమ కుటుంబాన్ని వీడి హాస్పిటల్స్‌కే అంకితమై ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి ప్రజలకు ఊపిరి అందిస్తున్నారు.

సవాళ్లతో కూడిన పని

సవాళ్లతో కూడిన పని

నర్సులు పనిచేస్తున్న హాస్పిటల్స్‌లో ఎన్నో సవాళ్లతో కూడిన పనులను చేస్తున్నారు. పేషెంట్లకు మందులు అందివ్వడం నుంచి వారిని జాగ్రత్తగా చూసుకోవడం, టెస్టుల సమయంలో సహాయ సహకారాలు అందించడం, రక్తం ఎక్కించడం, ఆక్సిజన్ ఉంచడం వంటి పనులు చేస్తున్నారు.

ఇక పేషెంట్ రికార్డులను మెయిన్‌టెయిన్ చేయండం, జూనియర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు హాస్పిటల్స్‌లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు.ఇక ఏటా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజున ఒక థీమ్ ఇవ్వడం జరుగుతంది. ఈ సారి థీమ్ " ఎ వాయిస్ టు లీడ్ - ఎ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్.

English summary
May 12th is celebrated as International Nurses day as it is the birth anniversary of Flourence Nightingale.This year theme is A voice to lead - A vision for future health care
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X