వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి.. గాంధీ చూపిన మార్గమే శిరోధార్యమన్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వసుదైక కుటుంబం, విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు వచ్చిందన్నారు. యోగాకు కూడా అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం వద్ద ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు చూపిన విధానాలే తమ అభివృద్ధికి బాటలు వేశాయని పేర్కొన్నారు.

గాంధీ జయంతి: ఏం మారింది మహాత్మా!గాంధీ జయంతి: ఏం మారింది మహాత్మా!

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో గల సబర్మతి ఆశ్రమంలో ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గాంధీ చూపిన విధానం అచరణీయని పేర్కొన్నారు. గాంధీ మార్గదిర్దేశనంతో భారత్ ప్రతిష్ట మరింత పెరిగిందని తెలిపారు. తాను ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక తొలిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన సమయంలో యోగా గురించి వివరించామని మోడీ గుర్తుచేశారు. ఆ తర్వాత యోగా డేను ఐక్యరాజ్యసమితి కూడా జరుపుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అధికారికంగా నిర్వహించిందని మోడీ గుర్తుచేశారు.

international reputation at yoga says pm modi

పురాతన కాలంలో యోగా ప్రాచుర్యం పొందింది. కానీ ఆధునిక సమాజంలో గుర్తించలేదు. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం యోగాకు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ప్రతీ సభ, వేదికపై యోగా గురించి మోడీ వివరిస్తారు. ఇలా ఐక్యరాజ్యసమితి వరకు యోగా ప్రాశస్త్యం గురించి తెలిసింది. మరోవైపు గాంధీ జీ సత్యం, అహింస విధానాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రధాని మోడీ చెప్తున్నారు. గాంధీ జీ వారసులుగా ఆయన విధానాలను కొనసాగిస్తామని తెలిపారు.

English summary
international reputation at yoga. gandhi ji truth, non-violence is our policy says prime minister narendra modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X