వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిగా పుట్టుంటే బాగుండేది, కానీ: షారుక్

|
Google Oneindia TeluguNews

ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో మహిళలకు అభినందలు తెలపడం సాధారణ విషయమే. కానీ, బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ట్విట్టర్‌లో మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన తీరు ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ 'అప్పుడప్పుడూ అమ్మాయిగా పుట్టినా బాగుండేది అనిపిస్తుంటుంది. కానీ, ఓ మహిళకు ఉండాల్సిన శక్తి, ధైర్యం, త్యాగం చేసే తత్వం, అందం నాకు లేవు. మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

International Women's Day: I wish I was a woman, says Shah Rukh Khan

మహిళలకున్నంత ప్రేమ, త్యాగం తెగువ, శక్తిసామర్ధ్యాలు పురుషులకు ఉండవని చెబుతూ ఆకట్టుకున్నాడు. అలాంటి లక్షణాలు మనకు అలవడలేదని, అవి అమ్మాయిలకు మాత్రమే సొంతం.. థ్యాంక్యూ గర్ల్స్ అంటూ ట్వీట్ చేశాడు.

షారుక్ తోపాటు మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు అదితి రావ్‌ హైదరి, కృతిసనన్‌‌, తదితరులు మహిళల గొప్పతనాన్ని వివరిస్తూ మహిళా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
As everyone round the world is celebrating this day, Bollywood celebrities like Shah Rukh Khan, Kriti Sanon and Aditi Rao Hydari also took to Twitter to pay tribute to the courage and strength of being a female on the occasion of International Women's Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X