వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ చిట్కా: కరోనా వల్ల తలెత్తే శ్వాసకోశ ఇబ్బందులను ఇలా అధిగమించవచ్చు: ప్రధాని

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజల ముందుకొచ్చారు. ఆదివారం తెల్లవారు జామున 6:30 గంటలకు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తరచూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న ప్రధానమంత్రి.. ఈ సారి భిన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజల ముందుకొచ్చారు. యోగా విశిష్టతలను గురించి వివరించారు. తనకు తెలిసిన కొన్ని వైద్యపరమైన చిట్కాలనూ వివరించారు.

Recommended Video

#YogaDay : Pranayama Helps To ఫైట్ Against COVID-19 Says PM Modi On Yoga Day
శ్వాసకోశ ఇబ్బందులను అధిగమించడానికి

శ్వాసకోశ ఇబ్బందులను అధిగమించడానికి

కరోనా వైరస్ బారిన పడిన వారిలో తలెత్తే ప్రధాన అనారోగ్య సమస్య.. శ్వాసకోశ ఇబ్బందులు. కరోనా వైరస్ మన శ్వాసకోశాన్ని ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడానికి పేషెంట్లు ఇబ్బంది పడతారు. కరోనా మరింత తీవ్రంగా మారితే.. ఊపిరి తీసుకోవడానికి పేషెంట్లు కష్టపడాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి యోగాలో చిట్కాలు ఉన్నాయని ప్రధాని వివరించారు. దాని ద్వారా ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా వరకు ప్రయత్నించవచ్చనీ అన్నారు.

ప్రాణాయామం ద్వారా

ప్రాణాయామం ద్వారా

యోగాసనాల్లో కీలకమైన ప్రాణాయామం ద్వారా శ్వాసకోశ ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చని నరేంద్ర మోడీ వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రాణాయామాన్ని నేర్చుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితుల్లోనూ ప్రాణాయామం వల్ల శారీరకంగా, మానసికంగా ధృడత్వాన్ని సాధించవచ్చని చెప్పారు. భారతీయుల మూలాల్లో ప్రాణాయామ వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. శతాబ్దాల కిందటే ప్రాణాయామాన్ని ఆచరించే వారని చెప్పుకొచ్చారు.

 ఇళ్లల్లోనే యోగా..

ఇళ్లల్లోనే యోగా..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోనే ఉంటూ యోగాసనాలను వేయాలని మోడీ విజ్ఙప్తి చేశారు. ఫలితంగా కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అంతరాన్ని, దూరాన్ని యోగా తగ్గిస్తుందని చెప్పారు. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు.. ఇలా అన్ని వయస్సుల వారూ యోగాసనాలను వేయడాన్ని తమ జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు.

మనోబలానికి యోగా

మనోబలానికి యోగా


అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సడలని మానసిక ధృఢత్వాన్ని సాధించడాని యోగా ఉపయోగపడుతుందని, స్వామి వివేకానంద సైతం ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు. ప్రధాని అన్నారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ధైర్యంగా నిల్చుందని, దీనికి ప్రధాన కారణం యోగా మంత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ.. తన ప్రసంగంలో స్వామి వివేకానందుడి సూక్తులను ఉటంకించారు. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఉచ్ఛరించారు.

English summary
Yoga enhances our quest for a healthier planet. It has emerged as a force for unity and deepens the bonds of humanity. It does not discriminate, it goes beyond race, colour, gender, faith and descent: Prime Minister Narendra Modi. COVID19 attacks our respiratory system.'Pranayam', a breathing exercise is something that helps us the most in making our respiratory system strong, Modi added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X