వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో మెరుగుపడుతున్న సిచుయేషన్.. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనుండగా .. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మరోవైపు ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించారు. పరిస్థితిని బట్టి మిగతా జిల్లాల్లో కూడా ఆంక్షలను సడలిస్తామని కశ్మీర్ ప్రభుత్వ వర్గాలు శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

Internet services restored in kashmir 5 districts

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత 13వ రోజు పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు పనిచేస్తాయి. మరోవైపు కమ్యునికేషన్ వ్యవస్థను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఇవాళ ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధించారు. మిగతా జిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి ఆంక్షలను సడలిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో 24 జిల్లాలు ఉండగా .. ఇప్పటికే 12 జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. 12 జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. పరిస్థితిని బట్టి క్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. మరో వారంలో పరిస్థితి యాధాస్థితికి వస్తోందని అధికారులు చెప్తున్నారు.

English summary
On Day 13 of clampdown after abrogation of Article 370 of the Constitution and bifurcation of Jammu and Kashmir, restrictions are gradually being eased while security forces remain on high alert. State government officials said most phone lines in the Valley will be gradually restored over the weekend and schools will reopen area-wise next week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X